కృష్ణుడు ఆనందానికి, అనురాగానికి అంతులేని నిధి.
కృష్ణుడి అందాన్ని, సద్గుణాలను, యౌవనాన్ని చూసి గోపికలు ముగ్ధులయ్యారు.
కృష్ణుడి శీలము, కీర్తి, సంతోషము అన్నీ అనంతం.
ఆ నీలమేఘశ్యాముని రూపం అత్యంత మనోహరం.
కృష్ణుడు రాక్షసులను అవలీలగా సంహరించే వాడు.
కృష్ణుడు నేర్పుకు, లీలలకు, కళలకు నిధి.
ఏ పని కోసమైతే వెళ్తాడో ఆ కార్యాన్ని తప్పక పూర్తి చేయడంలో దిట్ట.
కృష్ణుడు ఆనంద నిలయం! కోరికలు తీర్చువాడు. నడుమున పీతాంబరం, పెదవులపై మురళి ధరించిన దివ్య స్వరూపుడు శ్రీకృష్ణుడు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి