కానీ అమ్మకు మాత్రం అన్నింటిలోనూ సమస్యే!
టీవీ మీద కనిపించని దుమ్ము కణం కూడా
అమ్మ కంటికి స్పాట్‌లైట్‌లో కనిపిస్తుంది.
టేబుల్ మీద చిన్న మరక ఉంటే…అది కూడా అమ్మ మనశ్శాంతికి పెద్ద సమస్యే!
కిచెన్ ప్లాట్‌ఫామ్ కాస్త జిడ్డుగా ఉంటే… “అది సమస్యే!”సోఫా మీద మడతపెట్టని బట్ట కనిపిస్తే… అదీ మరో సమస్య!సింక్‌లో రెండు గిన్నెలు ఉంటే… అవి కడిగే వరకు సమస్యే!
బట్టలు ఉతకకపోయినా సమస్యే…
ఉతికినవి ఆరేయకపోయినా సమస్యే!
ఆరేసినవి మడతపెట్టకపోయినా సమస్యే…
మడతపెట్టినవి సరైన చోట పెట్టకపోయినా సమస్యే!
ఇంట్లో ఎవరికీ కనిపించని చిన్న చిన్న పనులన్నీ అమ్మకే ఎందుకో స్పష్టంగా కనిపిస్తాయి.అందుకే మన దృష్టిలో అమ్మకు ప్రతి విషయంలోనూ సమస్యే!కానీ ఒక్కసారి ఆలోచిస్తే…ఆ “సమస్యలు” లేకపోతే ఇల్లు ఎలా కనిపిస్తుంది?శుభ్రంగా ఉన్న నేల వెనుక అమ్మ చేతులు కనిపించవు.
చక్కగా సర్దిన గది వెనుక ఆమె కష్టం కనిపించదు.సమయానికి దొరికే బట్టల వెనుక ఆమె శ్రమ కనిపించదు.వేడిగా దొరికే భోజనం వెనుక ఆమె అలసట కనిపించదు.
మనకు కనిపించేది… చక్కగా ఉన్న ఇల్లు మాత్రమే.అమ్మకు కనిపించేది… ఆ ఇంటిని అలా ఉంచాల్సిన బాధ్యత.
ఒక్కరోజు అమ్మ ఏ పనీ చేయకుండా ఉంటే…
ఆమె “సమస్యలు” ఎంత అవసరమో మురికి ఇల్లు మనకే చెప్పేస్తుంది.
సమస్యల మధ్య జీవితకాలం సతమతమవుతూనే ఉంటుంది.
ఏంటో పిచ్చి అమ్మ!
మన కోసం ఇంత కష్టపడటం కూడా ఒక సమస్యే కదా…

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి