విన్నపాలు విన్నవించి వేడుకొంటిరా!
వెన్న,పాలు, మీగడలను పెట్టుచుంటి ప్రీతి తోడ.
వన్నెకాడ!నీవె నాకు బంధువంటిరా!
పున్నెమింత చేయలేదు పూర్వ జన్మలందు దేవ!
దన్నుగా చరించి వెంట దారి చూపుమా!
అన్న!యంచు పిల్చు కొంటి యాపదలను తీర్పవయ్య!
చెన్నుగా భజింతు నెపుడు చెన్న కేశవా!
మున్ను రక్కసులను చంపి భువిని గాచినట్టి స్వామి
చిన్ని పాప వోలె నవ్వు చిల్కు చుంటివే!
కన్నెగోపికలను కూడి గంతులేయు వాడవాహ!
వెన్నదొంగ! లీల గాంచ వేడుకాయెరా!
పన్నగశయనా!యటంచు భక్తులెల్ల పిల్వ వచ్చు
చిన్ని కృష్ణ నన్ను దరికి చేర్చుకోవయా!//
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి