ఆటవెలది పద్యాలు
1
విద్యనొసగు తండ్రి విజ్ఞేశ్వరుని పూజ
ప్రధమ గణముల కధి పతివి నీవె
పాలవెల్లి గట్టి భక్తితో పూజించ
మూషికమ్ము నెక్కి ముచ్చట గర
2
మొదలు నిన్ను దలచి మొదలెట్టు కార్యము
ప్రధమ గణము లకధి పతివి నీవు
మట్టి బొమ్మ చేసి మంచి గంధము బూసి
విఘ్న రాజ నీవు వేగ రావె
3
పాలవెల్లి గట్టి భక్తితో పూజింప
మనసులోన నిలిపి శక్తి కొలిచి
ఫలము పత్రియు పూలు భక్తితో నర్పించు
కరుణ తోడ మమ్ము గావు మయ్య
4
శివుని కొమరు డవుగ చింతలు తీర్చుము
బుద్ధి జ్ఞాన మిచ్చి బ్రోవు మయ్య
పాపములను బాపు పార్వతీ తనయుడ
చిత్తశుద్ధి కలిగి జేయు పూజ
5
పిండి వంటలన్ని ప్రేమతో నర్పించి
భక్తితోడ నీకు భజన జేతు
సిద్ధిబుద్ధి గొలుచు శ్రీ గణేశుడ నీవు
వక్రతుండదేవ వరము లీవె
6
వాడ వాడ లందు భక్తులందరుజేరి
విగ్రహములను దెచ్చి వీధి నందు
నాట పాట లాడి నానంద మొప్పగా
గౌరి తనయ మమ్ము గావు మయ్య
7
ప్లాస్టరు గణపతియె పర్యావరణ చేటు
రంగు పులిమి నంత రక్ష లేదు
నీటిలోన కలుప నీరు కలుషితమ్ము
తెలిసి మసలు కొనుము తెలుగు బిడ్డ
విద్యనొసగు తండ్రి విజ్ఞేశ్వరుని పూజ
ప్రధమ గణముల కధి పతివి నీవె
పాలవెల్లి గట్టి భక్తితో పూజించ
మూషికమ్ము నెక్కి ముచ్చట గర
2
మొదలు నిన్ను దలచి మొదలెట్టు కార్యము
ప్రధమ గణము లకధి పతివి నీవు
మట్టి బొమ్మ చేసి మంచి గంధము బూసి
విఘ్న రాజ నీవు వేగ రావె
3
పాలవెల్లి గట్టి భక్తితో పూజింప
మనసులోన నిలిపి శక్తి కొలిచి
ఫలము పత్రియు పూలు భక్తితో నర్పించు
కరుణ తోడ మమ్ము గావు మయ్య
4
శివుని కొమరు డవుగ చింతలు తీర్చుము
బుద్ధి జ్ఞాన మిచ్చి బ్రోవు మయ్య
పాపములను బాపు పార్వతీ తనయుడ
చిత్తశుద్ధి కలిగి జేయు పూజ
5
పిండి వంటలన్ని ప్రేమతో నర్పించి
భక్తితోడ నీకు భజన జేతు
సిద్ధిబుద్ధి గొలుచు శ్రీ గణేశుడ నీవు
వక్రతుండదేవ వరము లీవె
6
వాడ వాడ లందు భక్తులందరుజేరి
విగ్రహములను దెచ్చి వీధి నందు
నాట పాట లాడి నానంద మొప్పగా
గౌరి తనయ మమ్ము గావు మయ్య
7
ప్లాస్టరు గణపతియె పర్యావరణ చేటు
రంగు పులిమి నంత రక్ష లేదు
నీటిలోన కలుప నీరు కలుషితమ్ము
తెలిసి మసలు కొనుము తెలుగు బిడ్డ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి