మనిషి ఓడిపోయాడంటే చాలు… చుట్టూ సలహాలు చెప్పేవాళ్లు తయారైపోతారు.
“అప్పుడే చెప్పాను కదా!” అంటూ అందరూ పెద్ద తెలివైన వాళ్లలా మాట్లాడతారు.ఎక్కడ తప్పు జరిగిందో చెప్పడానికి మాత్రం అందరికీ చాలా ఆసక్తి.ఎందుకంటే "అది" మన ఓటమి కాదు కదా… మనకెందుకు బాధ!
పడిపోయినవాడిని లేపడం కంటే,“ఎలా పడిపోయావో నాకు ముందే తెలుసు” అని చెప్పడం చాలా సులువు.
ఇతరుల తప్పులు చెప్పడంలో అందరూ ముందుంటారు,తమ తప్పులు వస్తే మాత్రం కారణాలు సిద్ధంగా ఉంటాయి.వాడి తప్పు అయితే “వాడి తప్పు”…
మనది అయితే “పరిస్థితుల తప్పు!”
ఒకరి ఓటమి కొందరికి నవ్వు…
ఇంకొందరికి టీ టైమ్ చర్చ.
“వాడు పనికిరాడు” అని చెప్పడం చాలా సులువు.అదే మాట మన గురించి ఎవరైనా అంటే మాత్రం వెంటనే బాధ మొదలవుతుంది.
నిజానికి ఓడిపోయినవాడికి ఆ సమయంలో పెద్ద సలహాలు అవసరం లేదు.
“పర్లేదు… మళ్లీ ప్రయత్నించు” అనే చిన్న మాట చాలు.
మొత్తానికి అనేవాళ్ళు మనుషులే.
మనుషులకు తెలిసిన మొదటి విద్య, "మాట్లాడటం".
సో....మహా అయితే నాలుగు మాటలు మాట్లాడుతారు…
తర్వాత మర్చిపోతారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి