సంపూర్ణ మహాభారతముసరళ వ్యావహారిక భాషలో...!
 కర్ణ పర్వము ద్వితీయాశ్వాసము- 384 వ రోజు


కర్ణుడి పరాక్రమము
కర్ణుడు సాత్యకిని ఎదుర్కొని సాత్యకి రథము కూల్చాడు. సాత్యకి మరొక రథము తీసుకుని కర్ణుడిని ఎదుర్కొన్నాడు. ఇంతలో ఉపపాడవులు, ధృష్టద్యుమ్నుడు, శిఖండి, భీముడు, నకుల సహదేవులు సాత్యకికి సాయంగా వచ్చారు. కర్ణుడికి సాత్యకికి మధ్య ఘోరయుద్ధము జరిగింది. సాత్యకి, ధృష్టద్యుమ్నుడు, ఉపపాడవులు కలిసి కర్ణుడి మీద శరవర్షం కురిపించాడు. కర్ణుడు వారందరి రథములను విరిచి వారిని విరధులను చేసాడు. కర్ణుడు ధర్మరాజును ఎదుర్కొన్నాడు. ఛేదిసైన్యము ధర్మజునికి సాయంగా వచ్చింది. కర్ణుడు వారిని అందరిని తరుముతున్నాడు. ఇంతలో సాత్యకి, శిఖండి మరి కొందరు వీరులు ధర్మజుడికి సాయం వచ్చారు. వారి మధ్య యుద్ధం తీవ్రమైంది. కర్ణుడి పరాక్రమము ముందు పాండవసేనలు వెలవెలబోయాయి. కర్ణుడు ధర్మరాజు ధనస్సును ఖండించి తొంభై బాణములు ప్రయోగించి ధర్మరాజు కవచమును చీల్చాడు. ధర్మరాజు శక్తి ఆయుధమును కర్ణుడి మీద విసిరాడు. కర్ణుడు శక్తి ఆయుధమును ముక్కలు చేసాడు. ధర్మరాజు కర్ణుడి శరీరమంతా బాణములతో కొట్టాడు. కర్ణుడు ధర్మరాజు కేతనము విరిచి అతడి సారథిని చంపాడు. సాత్యకి, శిఖండి కర్ణుడి మీద శరములు గుప్పించారు. కర్ణుడు వారి రథములు విరిచి వారి ధనస్సులు విరిచి ధర్మరాజు శరీరం అంతా వాడి అయిన బాణములు దించాడు. కర్ణుని పరాక్రమము తట్టుకో లేక ధర్మరాజు తన రథమును పక్కకు మళ్ళించి యుద్ధ భూమి నుండి తొలగి పోయాడు. కర్ణుడు ధర్మరాజు వెంట తరిమి పరిహాసంగా " ఓ ధర్మరాజా ! క్షత్రియ కులములో పుట్టావు. ధర్మాధర్మ విచక్షణ తెలిసిన వాడివి ఇలా భీరువులా యుద్ధ భూమిని వదిలి ప్రాణభయంతో పారిపోతగునా ! నీకు రాజ నీతి తెలియదు. నీవు బ్రాహ్మణుడి వలె పిరికి వాడివి. నా వంటి వీరులతో నీవు పోరాడి గెలువ లేవు. నేను నిన్ను చంపను నీకు యుద్ధం ఎందుకు వెళ్ళి యజ్ఞయాగాదులు చేసి జీవించు. కృషార్జునులు ఉన్న చోటుకు వెళ్ళి దాక్కో " అన్నాడు. ధర్మరాజు సిగ్గుతో తలవంచు కుని అక్కడి నుండి వెళ్ళాడు. కర్ణుడు ధర్మరాజును వదిలి అతడి సైన్యమును హతమారుస్తున్నాడు. పాండవ సైన్యము పారిపోయింది. కౌరవ సైన్యము జయజయ ధ్వానాలు చేసాయి.
భీమసేనుడి పరాక్రమము*
ధర్మరాజును కర్ణుడు అవమానించడం చూసిన భీమసేనుడు సాత్యకి ధృష్టద్యుమ్నులతో " నా అన్న భంగపాటు నాకెంతో బాధకలిగించింది. నా అన్నను అవమానించిన కర్ణుడి మీద పగతీర్చుకోవాలి. మీరిద్దరూ ధర్మరాజును కాపాడండి నేను వెళ్ళి కర్ణుడి అంతు చూస్తాను. ఈ రోజు నేనో కర్ణుడో ఎవరో ఒకరే ఉండాలి " అన్నాడు. మహా క్రోధంతో తమ వైపు వస్తున్న భీముని చూసి శల్యుడు " కర్ణా ! అడుగో భీముడు ఆగ్రహంతో వస్తున్నాడు. భీముడు కోపించిన మూడులోకాలు నిలువ లేవు. నీవు అతడిని ఎదుర్కొని నీ బలపరాక్రమలు చూపించు " అన్నాడు. కర్ణుడు " శల్యా ! భీముడు అల్పుడు, అతడు పరాక్రవంతుడా ! అతడిని చంపితే నాకేమి కీర్తి వస్తుంది. అతడిని చంపక యుద్ధము మాత్రము చేస్తాను. అతడి కొరకు అర్జునుడు రావాలి అర్జునుడిని చంపి కీర్తి గడిస్తాను. భీముని ఎదురుగా రథము పోనివ్వు " అన్నాడు. కర్ణుడు భీముని ఎదుర్కొని అతడిపై శరవర్షం కురిపించి అతడి విల్లు తుంచాడు. భీముడు మరొక విల్లందుకుని కర్ణుని వక్షస్థలము మీద గురి చూసి కొట్టాడు. కర్ణుడు భీముని కవచాచ్చి చీల్చాడు. భీముడు ఒక బల్లబాణాన్ని ప్రయోగించి కర్ణుడి వక్షస్థలాన్ని కొట్టి అతడిని మూర్ఛిల్లజేసాడు. భీముడు తన అన్నను తూల నాడిన నాలుకను ఖండిస్తానని ఒక ఖడగం తీసుకుని కర్ణుడి రథము మీదకు లంఘించాడు. శల్యుడు భీముని వారించి " భీమసేనా ! ఆగు కర్ణుడు చావలేదు మూర్చపోయాడు. నీవు అతడి నాలుక కోస్తే రక్తస్రావంతో ప్రాణాలు విడుస్తాడు. అప్పుడు నీ అన్న ప్రతిజ్ఞ నెరవేరదు. కనుక అతడిని వదిలి పెట్టు " అన్నాడు. భీముడు ఆగి " నిజం శల్యా ! నాడు సభలో ధర్మజుడి మాట విని కర్ణుడిని వదిలాను. నేడు నా అన్న ప్రతిజ్ఞ నేరవేరాలని వదిలి వెడుతున్నాను " అన్నాడు. కర్ణుడు భీముని చేత భంగపడటం చూసిన సుయోధనుడు తన తమ్ములను కర్ణుడికి సాయంగా పంపాడు. వెంటనే శృతవర్మ కురుకుమారులను వెంటపెట్టుకుని భీముని ఎదుర్కొని చుట్టుముట్టారు. వారిని చూసి భీముడు మరింత విజృంభించి శ్రుతవర్మను అతడి అనుచరులను ఒకే వేటుకు హతమార్చాడు. వికటుడు, సముడు, గ్రాధుడు, నందుడు, ఉపనందుడు మొదలైన కురుకుమారులను బల్లెంతో హతమార్చాడు. ఇంతలో కర్ణుడు మూర్ఛ నుండి తేరుకుని భీముని విల్లు విరిచాడు. భీముడు తన గదను కర్ణుడి మీద వేసాడు. కర్ణుడు దానిని ముక్కలు చేసి ప్రకాశవంతమైన పది దివ్యాస్త్రములను భీముని మీద ప్రయోగించాడు. భీముడు వాటిని తప్పించుకుని ఒక బాణాన్ని కర్ణుడి వక్షస్థలానికి గురిపెట్టి వేసి అతడి కవచాచ్చి చీల్చాడు. కర్ణుడు భీముని మీద ఇరవై అయిదు బాణలులు ప్రయోగించి అతడి హయములను చంపా
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి
కామెంట్‌లు