హలో పిల్లలూ! సపోటాలు తినడం మీకిష్టమేనా! జిగటగా ఉంటాయి. కానీ రుచిగా ఉంటాయి. ఈ చెట్టు ఉష్ణ మండల ప్రాంతాలలో ఎక్కువగా పెరుగుతుంది. ఇది సతత హరితమైన చెట్టు. భారతదేశంలో మెక్సికోలలో ఈ సపోటా చెట్లను ఎక్కువగా పెంచుతారు. ఈ చెట్టు “సపోటేసి” కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయ నామం “మనిల్కరా జపోటా” ఇందులో గుండ్రంగా ఉండే సపోటాలు, కోలగా ఉండే సపోటాలు ఉంటాయి. కోలగా ఉండే పండ్లు పలుచని తోలుతో కండ మృదువుగా ఉంటాయి. క్రికెట్ బాల్ రకం సపోటాలు గుండ్రంగా తీపి తక్కువగా ఉంటాయి. కాలి పత్తి రకం పండ్లు కోలగా తోలు మందంగా, కండ తీయగా ఉంటాయి. ఈ పండ్లు నిల్వ చేయడానికీ, ఎగుమతికీ పనికి వస్తాయి. చెట్టు బెరడు తెల్లగా జిగురు కారుతూ ఉంటుంది. పూలు తెల్లగా చిన్నగా ఉంటాయి. గంట ఆకారంలో ఆరు రెక్కలతో ఉంటాయి. పండు పసుపు గోధుమ రంగులు కలగలిపినట్లుగా ఉంటుంది. ఒక్కో పండులో రెండు నుండి ఐదారు గింజలు ఉంటాయి. గింజలు నల్లగా నిగనిగలతో కోలగా ఉంటాయి. అందుకే వీటిని కన్నులుగా ఉపయోగిస్తారు. కళ్ల కోసం వాడటానికి చక్కగా అమరుతాయి. పచ్చి కాయలలో ‘సపోనిక్’ అనే పదార్థం ఉంటుంది. సపోటాలు తింటే నోరు ఎండిపోతుంది. దీనికి కారణం ‘టానిక్’ లాంటి పదార్థం భారత దేశంలో సపోటా అనీ ‘చిక్కూ’ అని ఫిలిపిన్స్ లో ‘చికో’ అనీ ఇండోనేషియాలో ‘సవో’ అని అంటారు. ఇందులో విటమిన్లు ఖనిజలవణాలు పోషక విలువలు ఉన్నాయి.
రెండు హాస్పిటల్ ప్లాస్టర్లను తీసుకొని తల, ముండెంగా అమర్చాను. తల ప్లాస్టర్ మధ్యలో దూదిని నింపి కళ్ళు, నోరు పెట్టాను. చేతుల కోసం ఖర్జూర విత్తనాలు ఉంచాను. లంగా కోసం డ్రై ఫ్రూట్స్ ను పెట్టాను. కాళ్ళ కోసం సపోటా గింజల్ని పెట్టాను. లంగాలో డిజైన్ వేయడానికి కూడా సపోటా గింజల్ని వాడాను. అనేక రకాల గింజల్ని వాడి అమ్మాయిల్ని తయారు చేస్తున్నాను. మా సరళ బాగుందా!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి