కర్ణ పర్వము ద్వితీయాశ్వాసము: 385 వ రోజు
భీముడు గాంధార సైన్యము ఎదుర్కొనుట
భీముడు రథము దిగి గదను తీసుకుని కర్ణుడి మీదకు లంఘించి అడ్డు వచ్చిన మూడు వేల మంది అశ్వసైనికులను హతమార్చాడు. రథములను విరుస్తూ, హయములను గజములను కాల్బలంతో చంపుతూ రణభూమి అంతా తానే అయి విహరిస్తున్నాడు. ఇంతలో ఆరు వందల గాంధారసేన భీముని చుట్టుముట్టారు. భీముడు వారి సారధులను, హయములను చంపి, రథములను, కేతనములను విరిచి సర్వనాశనం చేసాడు. శకుని మూడు వేల సైన్యాలను భీముని మీదకు పంపాడు. భీముడు కార్చిచ్చు అడవిని కాల్చినట్లు వారిని హతమార్చి వేరొక రథము ఎక్కి యుద్ధము చేయసాగాడు.
కురు పాండవుల సమరం
మధ్యాహ్న సమయం అయింది. కర్ణుడు తిరిగి ధర్మజుని ఎదుర్కొని తన తీవ్రమైన బాణములతో ధర్మజుని సారథిని చంపాడు. సారథి లేని రథాన్ని హయములు ఎటో లాక్కుని వెళ్ళాయి. అది చూసి భీముడు తిరిగి కర్ణుడిని ఎదుర్కొన్నాడు. ఇంతలో సాత్యకి అడ్డుపడి కర్ణుని ఎదుర్కొన్నాడు. ఇరువురు తమ బాణాలతో ఆకాశాన్ని కప్పారు. కర్ణుడికి సాయంగా కృపాచార్యుడు శకుని, కృతవర్మ, అశ్వత్థామ తమ తమ సైన్యములతో వచ్చారు. యుద్ధము ఘోరంగా సాగుతుంది. రథములు కేతనములు విరుగుతున్నాయి, గజములు హయములు కాల్బలములు చనిపోతున్నాయి, రక్తం వరదలై పారుతుంది. తెగిన తలలు, విరిగిన కాళ్ళు చేతులు, తునాతునకలు అయిన ధనస్సులు, రథములు, నేల మీద దొర్లే కిరీటములు ఛత్రములు చామరముల గుట్టలతో రణ భూమి నిండి పోయింది.
అర్జునుడు త్రిగర్త సేనలను ఎదుర్కొనుట
తనను ఎదిరించిన త్రిగర్తసేనలతో అర్జునుడు ఘోరంగా యుద్ధము సాగిస్తున్నాడు. సుశర్మ అర్జుడి మీద పది నిశిత శరములు ఉపయోగించి కృష్ణుడి మీద మూడు బాణములు వేసి గాయపరిచాడు. కపిధ్వజమును తెగనరికాడు. కపిధ్వజము మీద ఉన్న హనుమంతుడు బిగ్గరగా అరిచాడు. ఆ అరుపులకు త్రిగర్తలు సైనికులు మూర్ఛపోయి వెంటనే తేరుకుని అర్జునుడిని చుట్టుముట్టారు. అర్జునుడు వారి మీద బాణప్రయోగము చేస్తుంటే కృష్ణుడు అవలీలగా రథమును బయటకు తీసుకు వచ్చాడు. అర్జునుడు సర్పాస్త్రముతో త్రిగర్త సైనికిల కాళ్ళను చేతులను బంధించగా సుశర్మ గరుడాస్త్రమును ప్రయోగించి వారిని బంధవిముక్తులను చేసి అర్జునుడి మీద ఒక దివ్యాస్త్రము ప్రయోగించాడు. ఆ అస్త్రప్రభావానికి అర్జునుడు మూర్ఛిల్లి రథము మీద పడ్డాడు. అర్జునుడు మరణించాడనుకుని కురుసేనలు భేరీ మృదంగాలు మ్రోగించాడు. అర్జునుడు మూర్ఛ నుండి తేరుకుని సుశర్మ మీద బాణములు గుప్పించి సైన్యముపై ఇంద్రాస్త్ర ప్రయోగము చేసాడు. ఇంద్రాస్త్రము నుండి అనేక ఆకృతులు కలిగిన బాణములు వెలువడి త్రిగర్త సైన్యములను బలి తీసుకున్నాయి. పోయిన వాళ్ళు పోగా మిగిలిన పదునాలుగు వేల మంది అర్జునుడిని చుట్టుముట్టారు. అర్జునుడు వారితో భీకరంగా యుద్ధము చేస్తున్నాడు.
కృపాచార్యుని సమరం
పాండవ సేనల ధాటికి ఆగ లేక కౌరవ సేనలు పారిపోతున్నాయి. సుయోధనుడు, కృతవర్మ, కృపాచార్యుడు, దుశ్శాసనుడు వారిని యుద్ధోన్ముఖులను చేస్తున్నాడు. కృపాచార్యుడు పాంచాల సేనల మీద శరవర్షం కురిపిస్తూ శిఖండి రథమును విరిచి, సారథిని హయములను చంపాడు. శిఖండి తన రథము దిగి కత్తి డాలు తీసుకుని కృపాచార్యుని ఎదుర్కొన్నాడు. కృపాచార్యుడు శిఖండి మీద బాణములు గుప్పించాడు. ఇంతలో ధృష్టద్యుమ్నుడు కృపాచార్యుని ఎదుర్కొన్నాడు. కృతవర్మ మధ్యలో వచ్చి ధృష్టద్యుమ్నుని ఎదుర్కొన్నాడు. ధర్మరాజు ఉపపాండవులతో అశ్వత్థామను ఎదుర్కొన్నాడు. నకుల సహదేవులు సుయోధనుడిని ఎదుర్కొన్నారు. భీముడు కర్ణుడిని ఎదుర్కొన్నాడు. కృపాచార్యుడు శిఖండి చేతిలో ఉన్న డాలును ఖండించాడు. శిఖండి తన చేతిలో ఉన్న కత్తితో కృపాచార్యునితో యుద్ధము చేస్తున్నాడు. ఇంతలో సుకేతుడు వచ్చి కృపాచార్యుని ఎదుర్కొన్నాడు. శిఖండి అక్కడి నుండి తొలిగి పోయాడు. కృపాచార్యుడు సుకేతుని మీద ఆరు బాణములు ప్రయోగించి అతడి విల్లు ఖండించాడు. సుకేతుడు మరొక విల్లందుకున్నాడు కృపాచార్యుడు దానిని కూడా ఖండించాడు. సుకేతుడు మరొక విల్లందుకుని కృపాచార్యుని విల్లు విరిచి, అతడి అశ్వములను సారథిని కొట్టాడు. కృపాచార్యుడు సుకేతుడి మీద ముప్పది బాణములు ప్రయోగించాడు. ఆ శరముల ధాటికి సుకేతుడు తట్టుకొనలేక పోయాడు. అదను చూసి కృపాచార్యుడు ఒకే బాణంతో అత్సడి శిరస్సు ఖండించాడు. సుకేతుని మరణం చూసి అతడి సైన్యము చెదిరి పోయింది.
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి