*********
కలియుగంబున ధర్మమున్ గాల రాచి
పదవి కోసము ప్రభువులు పతనమయిరి.
నీతి నియమాలు తప్పిన నేత లిపుడు.
ప్రజల నేలంగ వచ్చిరి వసుధ యందు.
ధనము మరిగిన పాలకుల్ దారి తప్పి
ప్రజల సొమ్మును దోచుచు బ్రతుకు చుండ్రి.
పలుకుబడితోడ వచ్చిన పదవి వలన
దుష్ట కార్యముల్ సలుపుచు దొరలు చుండ్రి.
భావి భారత పౌరులు బాధ్యత మెయి
నడుగు వేయగ లభియించు నమిత శక్తి.
ఓటు నాయుధముగ మార్చి యుద్యమించి
దురిత మతులను దండింప తొలగు భయము.
శాస్త్రవిజ్ఞాన గ్రంథముల్ చదువుకొన్న
సజ్జనాత్ములు ప్రభువులై సభలు నడపి
ప్రజల మేలుకై పాలింప ప్రగతి పొలయు.
భరత దేశము నిల్చును వైభవముగ.//
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి