నేనొక బ్రతుకు పోరాటంలో ప్రాణం వున్న జీవశ్చవాన్ని...
గుండె లోతుల్లో దాగున్న ఆ నిశ్శబ్ద వేదన ఎవరికీ కనిపించదు...
పైకి నవ్వుతూ సాగే ఈ జీవిత ప్రయాణంలో ఎన్నెన్ని బాధల వలయాలో...
కన్నీటి చుక్కలు కూడా కనురెప్పల వెనుకే దాగి ఉండిపోతాయి...
కాలం కదులుతున్నా మానని ఆ పాత గాయం గుండెను పిండి చేస్తుంది...
లోలోపలే నాహృదయం నివురు కప్పిన నిప్పులా నన్ను నిలువెల్లా దహించి వేస్తుంది...
మాటల్లో వ్యక్తపర్చలేని ఆ అంతుచిక్కని తీవ్ర ఆవేదన తూయలేని భారమే...
ఒంటరితనం అనే చీకట్లు నన్ను మరింతగా భయపెడుతూ వెంటాడుతున్నాయి...
లోకం చూసే చూపులకు నా నవ్వు మాత్రమే కనిపిస్తుంది ...
అంతర్మధనంలో ఆవహించిన ఆక్రంధన జాబిలి కమ్మిన కరిమబ్బులా మసకబారింది...
నమ్మకాల పిరమిడ్లు కూలిపోయిన వేళ మిగిలిన శూన్యం ఇది...
ఆత్మీయుల మాటల విసుర్లు చేసిన గాయాలు ఎప్పటికీ మానవు...
పెదవులపై చిరునవ్వులు చిందిస్తూనే, మనసు లోపల ఏడుస్తున్నది...
సంతోషాల కేరింతలు ఏ శబ్దమూ లేకుండానే కరిగిపోతున్నాయి...
ఇక్కడ కాలమే అన్నిటికీ మందు అంటారు కానీ.
ఈ గాయానికి ఏ మందు పనిచేయడం లేదనే మాట పరమ నిశ్చలమైన సత్యం.
జ్ఞాపకాల దొంతరలు నన్ను నిరంతరం కలవరపెడుతూనే ఉన్నాయి .
ప్రతిక్షణం గాయం తాలూకు మరకలు నన్ను చూసి నవ్వుతూనే వున్నాయి...
ఈ చేదు జ్ఞాపకాలు చెరిపేయడం ఎవరి తరం కానే కాదు.
రక్తం చిందించని యుద్ధంలో నేనే ఓడిపోయిన సైనికుడిని
మనసు మూలల్లో దాచుకున్న ఆ రహస్య వేదనల సమాధి ఎవరికీ కనిపించనిది
ఈ అంతర్మధనం ఒక నిరంతర మహా ప్రవాహంలా సాగిపోతూ నన్ను మరింత బలహీనంగా మారుస్తోంది రోజరోజుకూ
అయినా సరే బ్రతుకు బండిని ముందుకు లాగక తప్పదు అనే నిరాశను దరిచేరనీయను.
ఓ కాలమా నా గాయాలకు నీవే పటాపంచలయ్యే లేపనం కావాలి...
జీవితం ఎన్ని సవాళ్ళు విసిరినా ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా పోరాడి గెలుస్తాను.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి