గంజాం భ్రమరాంబ కు అవార్డు

 

 జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా రేణిగుంట మండలంలో శనివారం  ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో గంజాం భ్రమరాంబ కు   Dyeo madam గారు, meo sir గారి చేతులమీదుగా ఉత్తమ మోడల్ స్కూల్ ప్రధానోపాధ్యాయులుగా అవార్డు లభించింది. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు, రామకృష్ణాపురం గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. గత రెండు సంవత్సరాలుగా పాఠశాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తూ దాతల సహకారంతో ఉదయం పూట పిల్లలకు టిఫెన్స్ ఏర్పాటు చేయడం, స్కూల్ కి మైక్ సెట్ ఏర్పరచడం,క్రమశిక్షణ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం, వివిధ సందర్భాలలో పిల్లలకు పోటీలు నిర్వహించి బహుమతులు అందించి ప్రోత్సహించారు. సహ ఉపాధ్యాయుల సహకారంతో వేసవి సెలవులలో సైతం ఎన్ రోల్మెట్ డ్రైవ్ పకడ్బందీగా నిర్వహించారు. కొందరు ప్రైవేటు స్కూల్ విద్యార్థులను కూడా గవర్నమెంట్ స్కూల్లో చేర్పించడం పట్ల పలువురు ప్రశంసలు లభించాయి.

కామెంట్‌లు