అమ్మఒడిలో పాలబుగ్గలం!
ప్రేమ, మమతలకు ఉగ్గులం!
తెలివికి తీసిన నిగ్గులం!
//ఇప్పుడు మేం//
పడతాం మేము చదువుల మార్గం!
కడతాం మేమొక సుందర దుర్గం!
మాదొక ఉత్తమ పౌరుల వర్గం!
చేస్తాం దేశాన్ని భూతల స్వర్గం!
//ఇప్పుడు మేం//
తగ్గి ఉండటం మాకిష్టం!
తలొగ్గి బ్రతకడం మాక్కష్టం!
దగ్గరకొస్తే శత్రువులపై
అగ్గిపిడుగులను కురిపిస్తాం!
//ఇప్పుడు మేం//
సిగ్గు, బిడియం కలిగినవారం!
దగ్గర, దూరం తెలిసినవారం!
ఉగ్గుపాలతో భక్తిని నేర్చాం!
నిగ్గదీసే వాక్శక్తిని పొందాం!
//ఇప్పుడు మేం//
మగ్గే దాస్యం మాకొద్దు!
బుగ్గన లాస్యం కద ముద్దు!
దిగ్గజాలమై అడుగేస్తాం!
స్వర్గాన్నే భువిలో సృష్టిస్తాం!
//ఇప్పుడు మేం//
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి