ఆక్ పాక్… కర్యపాక్!: - కొత్త విరిత
 

మన జీవితంలో కొన్ని ఉత్పత్తులు మనకంటే ఎక్కువ కాలం నుంచి మనతోనే ఉన్నాయి.
మనం చిన్నప్పుడు చూసిన అదే ప్రొడక్ట్ ఇప్పటికీ మార్కెట్‌లో ఉన్నాయి.
కానీ ఇప్పుడు దాన్ని గుర్తుపట్టడం కాస్త కష్టమే!ఎందుకంటే ప్రొడక్ట్ పాతదే… ప్యాకింగ్ మాత్రం కొత్తది
నిన్నటి వరకు సాధారణ డబ్బాలో ఉన్నది,ఈరోజు “అల్ట్రా అడ్వాన్స్డ్… ప్రీమియం… న్యూ జెన్ ఫార్ములా!” అయిపోయింది.లోపల ఉన్నది మాత్రం అదే పాత మామూలు పదార్థం!
ఒకప్పుడు దాన్ని కొంటే సరిపోయేది.ఇప్పుడు హీరో వచ్చి కొనమంటాడు, హీరోయిన్ నవ్వుతుంది,
బ్యాక్‌గ్రౌండ్‌లో “ధమ్… ధమ్… ధడామ్!” అంటూ తారా స్థాయి సౌండ్ ఎఫెక్ట్స్!
ప్రొడక్ట్ చేతిలో పట్టుకుంటే హీరోకి సూపర్ పవర్ వచ్చినట్టుగా చూపిస్తారు.
ఒక్కసారి వాడితే జీవితం మొత్తం మారిపోతుందేమో అనిపించేలా సంగీతం పెడతారు!
కొత్త కలర్…
కొత్త కవర్…
కొత్త స్లోగన్…
కానీ ప్యాకెట్ తెరిచి చూస్తే, అదే పాత ప్రొడక్ట్ మన వైపు వెకిలిగా నవ్వుతూ కనిపిస్తుంది!
ప్రకటనలు మారుతాయి.
నటులు మారుతారు.
సంగీతం మారుతుంది.
ప్యాకింగ్ మారుతుంది…
ధర కూడా మారుతుంది!
కానీ అసలు ప్రొడక్ట్ మాత్రం తన పాతదే.
సరుకు అదే… సోకు మాత్రం వేరు!
చివరికి అర్థమయ్యేది ఒక్కటే…
“ఆక్ ఇస్ పాక్… పాక్ ఇస్ ఆక్… ఆక్ పాక్ కర్యపాక్!” అని ఎంత హడావిడి చేసినా… ప్యాకెట్‌లో ఉన్నది మాత్రం పాత ప్రొడక్టే బాస్!
కామెంట్‌లు