ముళ్ళు సహజమే
మాటలలో వర్ణించలేని ప్రేమకు ప్రతీకయే గులాబీ
స్వచ్ఛమైన నిర్మల ప్రేమ వెనుక ఎన్నో కన్నీళ్ళు
ఎన్ని అవాంతరాలు ఎదురైనా
వాడిపోని అనుబంధం ప్రేమ బంధం.
గులాబీ అందం తాత్కాలికమే
వాడిపోయి మొక్కనుండి రాలిన
ఎన్నాళ్ళు ఉన్నదన్నది గాక
ఉన్నంత సేపు దాని అందం పరిమళం
అపురూపం .
పరమేశ్వరుని మెడలో పూలదండగా అయిన
స్త్రీమూర్తుల జడలో పూమాలగానైన
గులాబీ అందమే వేరు .
అలాగే నిజమైన ప్రేమికుల పరిమళం జీవితాంతం ఉంటుంది.
ముళ్ళు ఉన్న గులాబీ అందం మధురమే
కష్టాలు కన్నీళ్ళు ఉన్న నిస్వార్థ ప్రేమ శాశ్వతమే..!
.............................
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి