ఉగ్గు పాల వరవడిది! :- కోరాడనరసింహా రావు.


 అమ్మ ఉగ్గు పాలతో వరవడిగా పలికించిన
   పలుకుల తియ్యదనం
మన తెలుగు భాష..! 

ఇది మన తర తరాల 
తీరు...!! 

ఆ మాధుర్యం అమితా నంద దాయకం...! 

అమ్మ పాడిన లాలి పా టలు... జోల పాటలు , 
 చంద మామ రావే... 
 జాబిల్లి రావే అంటు... 
  బుజ్జగిస్తు బువ్వ తినిపించిన ఆ మధుర స్వరాలు..! 
 ఎద లోతుల్లో నాటుకు పోయి... 
 సుస్థిరమై... సురు చిరమై... 
  ఏ నాటికీ చెదరని , చెరగని స్మృతులుగా 
కలకాలం నిలిచే ఉంటా యన్నది అక్షర సత్యం !!

ఆదికవి నన్నయ మొదలు... 
 పోత నాదులుగా... 
 త్యాగయ్య, రామదాసు
అన్నమయ్యలతో  సహా
   కందుకూరి, గురజాడ
శ్రీ శ్రీ వంటి మహా మహు లెందరో... తర తరాలు గా
 మనతెలుగు భాషకు కీ ర్తి ఛత్రముతో పళ్లకి నెక్కించి మోసి, ఊరేగిం చినారు...! 

కృష్ణ రాయల చేత కీర్తిం ప బడిన మన తెలుగు పలుకుల కున్న తర తరాల వెలుగు జిలుగు లివి...!! 

అనేక   ప్రాంతీయ మా0డలికయాసలతో...
 సామెతలు , జాతీయనుడి కారాలతో
 సొబగు లద్దుకుని... 
 పద్య పరిమళములను వెద జల్లుచూ... 
 తర తరాల వెలుగుల ను విర జిమ్ముచూ... 
 దే దీ ప్య మా న మై... 
 వెలుగొందు చున్నది... 
 మన తియ్యని తెలుగు భాష...! 
    *******
కామెంట్‌లు