ఉపాధ్యాయుల సేవలు చిరస్మరణీయం: వెంకట్ , మొలక ప్రతినిధి
 మార్వాడీ యువ మంచ్ ఆధ్వర్యంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు


ఆల్ ఇండియా మార్వాడీ యువ మంచ్ తాండూర్ శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని వివిధ పాఠశాలల్లో సుదీర్ఘకాలం సేవలందించి పదవీ విరమణ పొందిన ఐదుగురు విశిష్ట ఉపాధ్యాయులను శాలువా, జ్ఞాపిక, పుష్పగుచ్ఛాలతో ఘనంగా సన్మానించారు.
సన్మానం పొందిన వారిలో బి. రాధిక, ఏ. శివకుమార్, బి. మళ్ళీనతప్ప, రాయ్ జాన్, అమృత లక్ష్మీ ఉన్నారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. “గురువు లేని జీవితం గమ్యం లేని ప్రయాణం వంటిది. విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర మరువలేనిది. వారి సేవలను గుర్తించి గౌరవించుకోవడం మా అదృష్టం” అన్నారు.
అనంతరం పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులు తమ అనుభవాలను పంచుకుని, మార్వాడీ యువ మంచ్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు.
అదేవిధంగా సమాజంలోని ప్రతిభావంతులైన విద్యార్థులను కూడా సన్మానించారు. MBBSలో ఉత్తీర్ణత సాధించిన డా. జయప్రకాశ్ సోనీ, LLBలో ఉత్తీర్ణత సాధించిన నితిన్ సోమానితో పాటు వివిధ పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులను ఘనంగా సత్కరించారు.
కార్యక్రమంలో మార్వాడీ యువ మంచ్ జాతీయ జాయింట్ సెక్రటరీ రోహిత్ అగర్వాల్, రాష్ట్ర కన్వీనర్ అనిల్ సార్డా, రాజస్థానీ మహిళా మండలి అధ్యక్షురాలు కిరణ్ సార్డా, రాజస్థానీ ప్రగతి సమాజ కార్యదర్శి సంపత్ కుమార్ సార్డా, ప్రముఖ వ్యాఖ్యాత గాజుల బసవరాజు, శాఖ అధ్యక్షులు కిషన్ రాధి, కార్యదర్శి కరణ్ జైన్, కోశాధికారి భరత్ దేవడా, ప్రోగ్రామ్ చైర్మన్ అభిషేక్ అగర్వాల్, వ్యాఖ్యాతలు అభిషేక్ సార్డా, నిఖిల్ తివారితో పాటు కార్యవర్గ సభ్యులు, యువ సభ్యులు, మహిళా సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కామెంట్‌లు