దినకరా! శుభకరా!: - పాలగుమ్మి జ్యోతి.


ఉదయాన్నే పలుకరించును 
 కిరణాలను ప్రసరించును 
 దినచర్యకు ప్రేరేపించును 
 ఆరోగ్యాన్ని ప్రసాదించును!!

 సప్త అశ్వాలతో ప్రయాణం 
 ఎరుగడు  సెలవు దినం 
 అగుపించే ప్రత్యక్ష దైవం 
 ఆకాశంలో మెరిసే అందం!!

 కశ్యపుడి తనయుడు 
 ఆదిత్య స్తోత్ర ప్రియుడు 
 నిత్య ప్రజ్వలుడు 
 ఇక్ష్వాకు వంశ ఆద్యుడు!!
కామెంట్‌లు