వినాయక చవితి: - G.రాణి-ఐదో తరగతి -ప్రాథమికోన్నత పాఠశాల-గ్రామం:నాగిరెడ్డి పేట్ -మం: నాగిరెడ్డి పేట్ -జి: కామారెడ్డి
 

రంగాపురం అనే ఊరిలో రాకేష్ ఐదో తరగతి చదువుతున్నాడు.ఒకరోజు  రాకేష్ తన,స్నేహితులందరు కలిసి వినాయక పండుగ వస్తుంది కదా,!  మనమందరం కలిసి వినాయకున్ని పెట్టి పూజలు చేద్దాం అన్నారు. ఆ భలే!భలే! మనమందరం కలిసి చేద్దాం అన్నారు మిగతావారు.బజారుకు వెళ్లి విగ్రహం తెద్దాం మరి చాలా ఖర్చు అవుతుంది కదా మనదగ్గర డబ్బులు లేవు కదరా ఏం చేద్దాం? అనుకున్నారంతా.ఒక పిల్లవాడు  అరే మనం మట్టితో గణేషున్ని మనమే తయారుచేసి పెడితే ఎలా ఉంటుంది అన్నాడు. వెంటనే ఇంకొకడు ఔనురా మా తరగతిలో టీచరు కూడా చెప్పింది.మనం రంగుల గణపతులు అంటే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసిన విగ్రహాల వల్ల చెరువు కాలుష్యం అవుతుందని,అందులోని ప్రాణులు చనిపోతాయనీ మట్టి గణపతులే పెట్టి పూజించాలనీ... వెంటనే ఇంకొకడు ఆ మట్టి గణపతిని చేయటం వల్ల మనకూ సృజనాత్మక పెరుగుతుంది అలాగే డబ్బులు కూడా అవసరంలేదు కదరా...అని అనగానే అందరూ సంతోషంగా వెళ్లి చెరువు దగ్గర మట్టి తెచ్చుకొని చిన్న విగ్రహాన్ని తయారు చేసుకున్నారు.దానికి ఐదు రోజుల పాటు పూజలు చేసి ఐదవ రోజు నిమజ్జనం చేసారు.అందరూ కలిసి చేయటం వల్ల వారి మధ్య స్నేహం మరింత బలపడింది అలాగే ఐకమత్యం అంటే ఏమిటో తెలుసుకోగలిగారు. ప్రతి సంవత్సరం మనం ఇలాగే పండుగ చేసుకుందాం అని అందరు స్నేహితులు నిశ్చయోంచుకున్నారు.
కామెంట్‌లు