అక్షరాలను అందంగా చెక్కే శిల్పి
చేత బెత్తం పట్టుకుని
శిష్యుల నడవడికను తీర్చిదిద్దే శిల్పి గురువే
ఒక్క మాటతో స్ఫూర్తినిచ్చి
భుజం తట్టి ధైర్యాన్నిచ్చి
ఒక్క చూపుతో తప్పును సరిదిద్ది
ఒక్క అడుగుతో దిశను చూపించి
గమ్యం వైపు నడిపిస్తూ
విజయ తీరాలకు చేర్చే
మార్గదర్శి మహనీయుడు గురువే
పుస్తకంలోని పాఠాలతో పాటు
జీవిత సత్యాలను కూడా బోధించి
విజ్ఞానమే విలువైన సంపదని
వినయమే మానవుని ఆభరణమని
కష్టపడితే కలలు నిజమవుతాయని
కృషి చేస్తే అసాధ్యమంటూ ఏదీ లేదని
ఓటమి ఎదురైనా వెనకడుగు వేయొద్దని
పట్టుదలతో ముందుకు సాగమని చెప్పి
శిష్యుడి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే
మహా శిల్పి గురువే
శిలను శిల్పంగా మార్చినట్టు
అజ్ఞానాన్ని జ్ఞానంగా మార్చి
విజ్ఞానాన్ని వివేకాన్ని నేర్పి
విద్యార్థిని మంచి మనిషిగా మలిచే
అద్భుత శిల్పి గురువే...
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి