36వ సర్గ : ( 2 ): - ఎడ్ల లక్ష్మి


నీవు నాకు సహాయపడు పద్ధతిని తెలిపెద వినుము 
తెల్లని చుక్కలతో బంగారు లేడి రూపమును పొంది 
ఆ ఆశ్రమము వద్దకు వెళ్లి సీత ఎదుట సంచరింపుము
నిన్ను జూచి ఆ సీత మోజు పడును. 

అప్పుడు ఆమె రామలక్ష్మణులను 
బంగారు లేడిని తెచ్చి ఇయ్యమని కోరును 
వారు నీ వెంబడి పరిగెత్తుచూ వచ్చేదరు  
అప్పుడు ఒంటరిగా ఉన్న సీతను నేను అపహరించెదను. 

రాముడు భార్య వియోగముతో
బాధతో కృంగి కృషించిపోవును 
అతనిని అచ్చటనే వధింపగలను
శ్రీరాముని పేరు వినినంతనే మారీచుడు భీతి చెందెను. 

అతని ముఖము వాడిపోయెను 
అతని పెదవులు తడారిపోయెను
ఆ మారీచూడు మహావనమునందు 
శ్రీరాముని పరాక్రమము రుచి చూచియుండెను 

అందువలన అతని మనసు శంకించెను
మారీచుడు రావణునికి నమస్కరించి 
రావణునికి తనకును మేలు చేకూరునట్టి
వాస్తవ విషయములను ఇట్లు నుడివెను.

===================================
 
అరణ్యకాండమందు 36వ సర్గ సమాప్తము.🙏🏻
కామెంట్‌లు