మనం చేసే ప్రతి మంచి చెడు పనే మన జీవిత గమనాన్ని నిర్ణయిస్తుంది. మనం చేసే పాప పుణ్యాల తాలూకు ఫలితాలు ఎక్కడికీపోవు, కర్మ రూపంలో కచ్చితంగా మనల్ని వెతుక్కుంటూ వచ్చి వెంటాడుతాయి.
అనగనగా తనుష్ అనే ఒక యువకుడు ఉండేవాడు. వయసుకు తగ్గ సంస్కారం లేకుండా, చిన్న వయసు నుంచే అతనికి అనేక చెడు అలవాట్లు అలవడ్డాయి. డ్రగ్స్ తీసుకోవడం, విచ్చలవిడిగా మద్యం సేవించడం, సిగరెట్లు కాల్చడం వంటి తీవ్రమైన వ్యసనాలకు బానిసయ్యాడు. ఇవేకాకుండా తోటివారిని గౌరవించడం మానేసి, అందరినీ నానా విధాలుగా ఇబ్బంది పెట్టడమే తన దైనందిన ప్రవర్తనగా మార్చుకున్నాడు. ఇంట్లో కన్న తల్లిదండ్రులు ఎంత చెప్పినా వారి మాటలను పెడచెవిన పెట్టేవాడు.
అలా రోజులు గడుస్తుండగా, ఒకరోజు
తనుష్ తలమాసిన ఆలోచనలతో, తీవ్రమైన డ్రగ్స్ మత్తులో కారు నడుపుకుంటూ వెళ్తున్నాడు. అదే సమయంలో దారిలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న ఒక అమాయకపు అమ్మాయి అతని కంట పడింది. ఆ క్షణంలో అతనిలోని రాక్షస బుద్ధి తలయెత్తింది. వెంటనే కారును పక్కకు ఆపి, ఆ అమ్మాయి వెనుకనే అడుగులు వేసుకుంటూ వెళ్ళాడు. తన దగ్గర ముందుగానే సిద్ధం చేసుకున్న మత్తుమందు పూసిన కర్చీఫ్‌తో, ఆ అమ్మాయి నోరుమూసి కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించాడు. ఆమె ప్రాణభయంతో గట్టిగా కేకలు వేయబోయింది.
అదృష్టవశాత్తు, అదే సమయంలో అటుగా వెళ్తున్న ఒక పెద్దాయన గమనించాడు. క్షణం కూడా ఆలోచించడానికి సమయం లేకపోవడంతో, వెంటనే అప్రమత్తమై తన ఫోన్ నుండి '100' నెంబర్‌కు డయల్ చేసి పోలీసులకు ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ అమ్మాయి వివరాలు చెప్పాడు.
పోలీసులు తక్షణమే స్పందించి అత్యంత వేగంగా ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడికక్కడే తనుష్‌ను రెడ్ హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు. జరిగిన ప్రమాదం నుండి కోలుకుని, ప్రాణభయంతో వణికిపోతున్న ఆ అమ్మాయి పరుగెత్తుకుంటూ ఇంటికి చేరుకుంది. కన్నీళ్లతో తన తల్లిదండ్రులకు జరిగిన విషయం పూసగుచ్చినట్లు వివరించింది. వారు దిగ్భ్రాంతి చెంది, వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనుష్పై ఫిర్యాదు చేశారు. ఈ కేసును తీవ్రంగా పరిగణించిన పోలీసులు విచారణ జరిపి, తదనంతరం తనుష్‌ను కోర్టులో హాజరుపరిచారు. నేరం రుజువు కావడంతో కోర్టు అతనికి 14 రోజులు కారాగార శిక్ష విధించింది.
చీకటి గదిలో, జైలు గోడల మధ్య ఒంటరిగా గడిపిన తనుష్ తాను చేసిన పనికి పశ్చాత్తాప పడ్డాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత అతను ఒక్కసారిగా గతాన్ని తలచుకుని తీవ్రంగా కుమిలిపోయాడు. తాను చేసిన ఆ నీచమైన, క్షమించరాని పనుల వల్ల తనను కన్న తల్లిదండ్రుల యొక్క పరువు సమాజంలో ఎంతలా మంటగలిసిపోయిందో, తన కారణంగా ఆ అమాయకపు కుటుంబం ఎంతటి క్షోభను, మానసిక వేదనను అనుభవించాల్సి వచ్చిందో తలచుకుని కన్నీరుమున్నీరుగా విలపించాడు. ఆ కన్నీటి పర్యంతంలో అతనికి ఒక కఠినమైన సత్యం అర్థమైంది. మనిషి చేసే పాపాలు ఈ భూమిపై ఎక్కడికీ పోవు, అవి మన నీడలాగే మనల్ని శాశ్వతంగా వెంటాడుతూనే ఉంటాయి. దాన్నే లోకులు 'కర్మ' అని పిలుస్తారు.
ఆ ఒక్క చేదు అనుభవం, ఆ జైలు శిక్ష తనుష్ జీవితాన్ని సమూలంగా మార్చివేసింది. తనను పతనం అంచుకు చేర్చిన ఆ చెడు వ్యసనాలన్నింటినీ ఆ క్షణమే పూర్తిగా విడిచిపెట్టాలని అనుకున్నాడు. అప్పటి నుంచి ఎవరినీ నొప్పించకుండా, అందరితో ఎంతో గౌరవంగా మాట్లాడుతూ, సమాజంలో మంచి పనులు చేస్తూ, నలుగురికీ ఆదర్శంగా బతకడానికి పూనుకున్నాడు.
నీతి: మనం చేసే ప్రతి పనీ, ప్రతి ఆలోచనా ఊరికే పోదు. భవిష్యత్తులో అది కచ్చితంగా మనల్నే వెతుక్కుంటూ వస్తుంది. అందుకే ఏనాడూ చెడు అలవాట్లకు, వ్యసనాలకు బానిస కాకుండా, సత్ప్రవర్తనతో మంచి మార్గంలో నడుచుకోవాలి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి