మనిషి నేడు పూర్తిగా ఒంటరైపోతున్నాడు : - యేచన్ చంద్ర శేఖర్-మొబైల్: 8885050822


బంధాలు బాంధవ్యాలు మర్చిపోతున్నాడు 
మనిషి నేడు పూర్తిగా ఒంటరైపోతున్నాడు 

ఏవేవో ఈర్ష్యాద్వేషాలతో రగిలిపోతున్నాడు 
సంకుచితత్వం స్వార్థాలకు బలవుతున్నాడు 

అందని దాని కోసం అర్రులు చాస్తున్నాడు 
గొంతెమ్మ కోర్కెలతో సతమతమవుతున్నాడు

ఇతరుల జీవితాల పట్ల కుళ్ళుకుంటున్నాడు 
స్వీయ జీవితాన్ని అస్వాదించలేకపోతున్నాడు

మానవ జీవితచక్రం స్వల్పమని విస్మరిస్తున్నాడు 
తన జీవితం శాశ్వతమనే భ్రమలో బ్రతికేస్తున్నాడు 

జీవితంలో పట్టువిడుపుల ప్రాధాన్యత మరిచాడు 
సర్దుకుపోయే గుణానికి ఎప్పుడో తిలోదకాలిచ్చాడు 

సదా తన పంతం నెగ్గాలని కోరుకుంటున్నాడు 
తెలియని  మానసిక రుగ్మతతో నలిగిపోతున్నాడు 

ఆనందం కోసం విలాసాల వెంట పరిగెడుతున్నాడు 
ఆత్మీయుల మధ్య ఉందని తెలుసుకోలేకపోతున్నాడు 

‘పోలికల’ సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాడు 
విషవలయంలో తనను తానే బందీ చేసుకుంటున్నాడు 

కామెంట్‌లు