చెప్పుడు మాటలు చెరుపు : - --గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు, సెల్ :9966414580

 

వింటే చెప్పుడు మాటలు  
దూరమగును స్నేహాలు 
పతనమగును బంధాలు 
కూలునోయ్!కుటుంబాలు 

జాగ్రత్త వాటితో 
అదువు లేని నోటితో 
ఉండాలి దూరంగా 
చూడాలి నిశితంగా 

చెప్పుడు మాటలు నిప్పులు 
బూడిద చేయును బ్రతుకులు 
విరిచివేయును మనసులు 
కూల్చునోయ్!కాపురాలు 

విన్నదంతా నిజం కాదు 
పరీక్షస్తే బహు మేలు 
వట్టిదంతా పనికి రాదు 
పరిశీధిస్తే చాలు 

కామెంట్‌లు