మనకోసం..!!: - సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.


మనకోసం మనం
ప్రదర్శన కోసం కాదు 
మన ప్రతిభ మనకోసం 
మనం మనకోసం ప్రదర్శన కోసం కాదు. 

మన సంతోషం మనకోసం 
మన ప్రేమ మనకోసం 
మన సృజనాత్మకత మనకోసం 
ప్రదర్శన కోసం కాదు. 

మన మనసు మనకోసం 
ప్రదర్శన కోసం కాదు 
మనం మనకోసం ప్రదర్శన కోసం కాదు

మన ఆకలి మనది 
మనం భోంచేస్తేనే మన ఆకలి తీరేదీ
మన దాహం మనది 
నీరు తాగితేనే మన దాహం తీరేదీ.
మన శ్వాస మనది 
మనం శ్వాసిస్తేనే మనం బ్రతికేది. 

మన  చూపు మనది 
మనం చూస్తేనే కనిపించేది 
మన వినికిడి మనది 
మనం వింటేనే వినిపించేది 
మన అనుభవం మనది 
మనం అనుభవిస్తేనే అనుభూతి చెందేది. 
మన కోసం మనం 
ప్రదర్శన కోసం కాదు. 

మన సంతృప్తి మనది 
మన సంతోషం మనది 
మన మనశ్శాంతి మనది 
మన అనుభూతి మనది 
మంది కోసం కాదు ప్రదర్శన కోసం కాదు. 
మనకోసం మనం. 
--------------------------------------------------------------
సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని యుపిఎస్ ఖానాపూర్ నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం.
కామెంట్‌లు