ఇవ్వాలి...!!: - సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.
 

నిజంగా మనం 
ఎవరినైనా ఇష్టపడ్డప్పుడు 
నిజంగా మనం 
ఎవరికైనా సహాయం చేయాలనుకున్నప్పుడు. 
నిజంగా మనకు 
ఎవరైనా నచ్చినప్పుడు. 
ముందు మనం 
వారికి మాట సహాయం చేయాలి. 
ఎదిగేందుకు ఏమి కావాలో అది ఇవ్వాలి. 
వారి సామర్ధ్యాలు పెంచాలి 
వారి అర్హతలు పెంచాలి సహకరించాలి. 
ఆ తర్వాత 
అవసరమైతే ఆర్థిక సహాయం చేయాలి. 
మార్గం చూపాలి మార్గదర్శకం కావాలి 
అండగా నిలబడాలి 
ఆ తర్వాతే మనం మన చెల్లినీ మన  అక్కనీ
మన అమ్మాయినీ ఇవ్వాలి.!!?
==========================================
సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని యుపిఎస్ ఖానాపూర్ నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం.
కామెంట్‌లు