కూరలో ఉప్పుతో పాటు కారం కూడా చాలా ముఖ్యం… రుచికి మాత్రమే కాదు, తినేవాడి మొహం చిట్లించడానికి కూడా!
ఒక్కసారి కారం లేని కూర తింటున్నట్లు ఊహించుకోండి… “యాక్!” అంటూ మూతి విరిచే ఎక్స్‌ప్రెషన్ తప్పదు.అలాగే జీవితంలో కూడా కాస్త ఎటకారం అవసరమే… లేకపోతే జీవితం రుచి పచి లేకుండా తయారవుతుంది.
ప్రతి విషయాన్నీ సీరియస్‌గా తీసుకుంటే, చివరికి మనమే మన జీవితానికి కామెడీ అవుతాం.ఎవరైనా “మీరు చాలా తెలివైనవారు” అంటే వెంటనే పొంగిపోవాల్సిన అవసరం లేదు… ఆ మాటలో "కారం" ఎంతుందో ముందుగా అర్థం చేసుకోవాలి.కొంతమంది పొగడ్తల్లో చక్కెర కంటే వ్యంగ్యమే ఎక్కువగా ఉంటుంది.ఎటకారం అంటే ఎదుటివాడిని అవమానించడం కాదు… నిజాన్ని నవ్వుతూ చురక పెట్టి చూపించే చిన్న అద్దం.
“నాకు అన్నీ తెలుసు” అనుకునేవాళ్లకు ఎటకారం మాత్రం అసలు జీర్ణం కాదు.
వాళ్ల జ్ఞానానికి తోడు అహంకారం కూడా ఉచితంగా వస్తుంది.కష్టాల్లో కూడా నవ్వుకోగలగడం ఓ రకమైన మానసిక బలం.ఎటకారం పరిస్థితుల్ని తేలిక చేయాలి… మనుషుల్ని తక్కువ చేయకూడదు.
కారం మోతాదు దాటితే కూర తినలేం… ఎటకారం మోతాదు దాటితే మనిషితో కలవలేం.అందుకే మాటలో కారం ఉండాలి… కానీ ఎదుటివాడి గుండెల్లో మంట పెట్టేంత కాదు.మనసు మంచిదైతే ఎటకారం నవ్విస్తుంది… మనసు చెడ్డదైతే అదే ఎటకారం గాయపరుస్తుంది.జీవితానికి ఉప్పు కావాలి, కారం కావాలి… మధ్యలో కాస్త ఎటకారం కూడా కావాలి.లేకపోతే జీవితం భోజనం కాదు..ఆసుపత్రిలో పెట్టే డైట్‌లా ఉంటుంది!
ఎటకారం నవ్వించాలి… నొప్పించకూడదు.
చురక పెట్టాలి…చితకబాదకూడదు.
మాటకు మజా ఉండాలి… మనిషికి గౌరవం ఉండాలి.
అదే అసలైన ఎటకారం…
అదే పక్కనవాడికి మాటలతో చేసే ఉపకారం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి