సుప్రభాత కవిత : - బృంద


మింటిని వీడి మట్టిని 
తడపాలని దూకిన 
చినుకుకు  త్రోవలో 
ఉందా అడ్డు?

కొమ్మల వాలి ఆశతో చూస్తూ 
అల్లాడుతూ స్వాగతించే 
ఆకును తడపాలని 
ఆత్రము కాదా!

శాఖల పలకరించి 
ప్రేమను చిలకరించి 
హాయిగా స్నానం పోసే 
ఆపేక్ష కాదా!

పాదున నిలిచి వేరును కలిసి 
నేలను ఇంకి నీరును ఇచ్చి 
మొక్కకు ప్రాణం పోసే 
బాధ్యత కాదా!

గుంటగా చేరి వంకగా పారి 
వాగుగా సాగి వరదలైపోయి 
నదితో కలిసి నడిచే 
స్నేహం కాదా!

నింగిని సాగే నీలి మబ్బుకు 
చినుకై కురిసి చిత్తడి చేసి 
కడలిని చేరే గమనంలో 
మలుపులన్నీ మమతలేగా!

🌸🌸సుప్రభాతం 🌸🌸

కామెంట్‌లు