నాన్న...!! స్మృతిలో..: - డా ప్రతాప్ కౌటిళ్యా.


రాయి రాయి పేర్చి 
ఒక మహా పర్వతాన్ని నిర్మించి 
మనల్ని శిఖరం పై నిలబెట్టి 
జెండాల ఎగిరేసిన నాన్న 
ఒక మహా పర్వతమే కదా..!!

మొక్క మొక్కను పెంచి 
ఒక దుర్భేద్య మహారణ్యాన్నీ
నిర్మించి 
దానికి మనల్ని రాజును చేసిన నాన్న 
ఒక మహారాణ్యమే కదా...!!

చుక్క చుక్క నీటిని చేర్చి 
ఒక మహా సముద్రాన్ని నిర్మించి 
మనల్ని ఆణిముత్యాల్ని చేసిన నాన్న 
ఒక మహాసముద్రుడే కదా...!!!

వెలిగే సూర్యుడు నాన్న 
చల్లని చంద్రుడు నాన్న 
విశాల ఆకాశం నాన్న 
మెరిసే నక్షత్రం నాన్న మన మనసులో విరిసిన ఇంద్రధనస్సు నాన్న...!!
==================================
నాన్న స్మృతిలో 
=================================
డా ప్రతాప్ కౌటిళ్యా...
కామెంట్‌లు