ముఖ కవళికలు. ; - డా ప్రతాప్ కౌటిళ్యా.


నేను అతని చూశాను మర్చిపోయాను 
నేను ఆమెను చూశాను మర్చిపోయాను 
ముఖాన్ని ముఖ కవళికలను మర్చిపోయాను. 

నేను ఆమెను చూశాను మర్చిపోలేకపోయాను 
నేను అతని చూశాను మర్చిపోలేకపోయాను 
ఆ ముఖాన్ని ఆ ముఖ కవళీకలను మర్చిపోలేకపోయాను. 

కారణము అతనే కర్త కర్మ క్రియ ఆమె కర్త కర్మ క్రియ కావడం. 

ఆమెను మళ్లీ గుర్తుపట్టాను 
అతన్ని మళ్ళీ మళ్ళీ గుర్తుపట్టాను 
నా సంతకంలా- నా ఫింగర్ ప్రింట్ లా..!!?

ఆమెకూ  పేస్ ప్రింట్స్ ఉంటాయి 
అతనికీ  పేస్ ప్రింట్స్ ఉంటాయి 
అవి 
ఒక సంతకంలా
ఒక ఫింగర్ ప్రింట్స్ లా 
ఒక ఛాయాచిత్రంలా...!!?

ఆమెను గుర్తుపట్టాను 
అతన్ని మళ్ళీ మళ్ళీ గుర్తుపట్టాను 
ఆమెను మర్చిపోలేకపోయాను 
అతన్ని మర్చిపోలేకపోయాను 
ఆ ముఖాన్ని ఆ ముఖకవలికలను మర్చిపోలేకపోయాను. 

డా ప్రతాప్ కౌటిళ్యా.
కామెంట్‌లు