అయితే చూడు
పరిమళం నచ్చిందా
అయితే ఆస్వాదించు
ఎర్రసూరీడు బాగున్నాడా
అయితే తిలకించు
సూర్యోదయం బాగుందా
అయితే వీక్షించు
నీలాకాశం బాగుందా
అయితే దర్శించు
తారలతళుకులు బాగున్నాయా
అయితే పరికించు
తెల్లనిచంద్రుడు బాగున్నాడా
అయితే కాంచు
చల్లనివెన్నెల బాగుందా
అయితే విహరించు
పచ్చనికొండలు బాగున్నాయా
అయితే తరచూ దర్శించు
కోనలకుంటలు బాగున్నాయా
అయితే రోజూ సందర్శించు
పడుచు బాగుందా
అయితే హృదయంలో స్థానమివ్వు
గుండెల్లో గుబులుపుట్టిస్తుందా
అయితే అంతరంగంలో నిలుపుకో
అందాలు బాగున్నాయా
అయితే కలకాలం గుర్తించుకో
ఆనందాలు అందుతున్నాయా
అయితే మనసులో దాచుకో
కవితలు బాగున్నాయా
అయితే రోజూ చదువు
కవనాలు మనసును తట్టాయా
అయితే చిరకాలం పదిలపరుచుకో
బాగుంటే అనుభూతులను భద్రపరచుకో
జ్ఞాపకాలను నెమరేసుకో
కాలాన్ని సద్వినియోగం చేసుకో
జీవితాన్ని బాగుపరుచుకో
గుండెల్లో గుబాళించు
హృదయాల్లో హత్తుకొను
మనసుల్లో నిలువు
మానవుల్లో మమేకమవు
.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి