ఏది తెలివైంది.!?: -డా ప్రతాప్ కౌటిళ్యా.


ఇష్టం లేని దాన్ని బయటికి తోసేసే 
బాధ్యత కడుపు తీసుకుంది. 
అది అత్యంత బుద్ధిమంతురాలు.!

కానీ 
ఇష్టం లేని ఎన్నో విషయాలను కూడా 
దిగమింగే బాధ్యత గొప్ప మెదడు తీసుకుంది. 
అది దాని తెలివి తక్కువ తనం!!

అవసరం  ఉన్నా లేకున్నా అన్నింటిని 
చూసి అంతా వినే బాధ్యత కళ్ళు చెవులు 
తీసుకున్నాయి. అది దాని కర్మ. 

ఇష్టం ఉన్నా లేకున్నా నిరంతరం తనను తాను 
కొట్టుకునే బాధ్యత గుప్పెడంత గుండె తీసుకుంది 
అది మనపై దాని ప్రేమ. 

ప్రపంచాన్ని ముంచే మహాసముద్రం ఒక్క నూనె చుక్కను ముంచ లేకపోయినట్లు. 
సరిగ్గా మనిషిని మొత్తం ముంచే మనిషి మనసు ఒక్క ద్వేషపు చుక్కను ముంచ లేకపోయింది.
అది మన కర్మ. 
------------------------------------
డా ప్రతాప్ కౌటిళ్యా.
కామెంట్‌లు