ఆకులు కప్పుకున్న ఆది మానవుడు...
వెండి, బంగారు జెరీ అంచుల
పట్టు వస్త్రములు ధరించు
అధునాతన మానవుని గా....
రూపా0తరం చెందటం లో... మూల మైన
పత్తినెలా విస్మ రించ గలం....?!
మనిషి జీవితంలోపత్తి నాగరికతకు మొదటి మెట్టు...!
అందానికి హుందా తనానికి, చల్లదనపు హాయికి,
ఆరోగ్యానికి పత్తితో తయారైన నూలు వస్త్రములకన్న
మిన్నయైన వస్త్రములు ఈ ప్రపంచమునందికే మైన గలవా...!?!
ఇంత గొప్పదైన మన వస్త్ర ధారణను వీడి....
బికారుల వలే...
సగము చిరిగిన వస్త్ర ములను ధరించుట హవ్వ సిగ్గు చేటు...!
వర్ధిల్లాలి మన పత్తి, పట్టు పరిశ్రమలు...!
విలసిల్లాలి స్వదేశి నియోగాలు...!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి