చలన చిత్ర పరిశ్రమలో తన అద్భుత నైపుణ్యంతో
దశా దిశా నిర్దేశించిన
అసమాన ప్రతిభ కనపరచిన
సంభాషణలు లేని పుష్పక విమానం చిత్రంతో ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న దర్శకునిగా
పంతులమ్మ సినిమాలో రసమయ పాటలతో తన ప్రతిభను చాటుకున్న
అమెరికా అమ్మాయి చిత్రంతో భారతీయ చలన చిత్ర రమణీయతను ప్రపంచానికే చాటిన
మయూరి చిత్రం ద్వారా అంగవైకల్యం ప్రతిభకు అడ్డుకాదని చెప్పి
నభూతో నభవిష్యతి గా తీర్చిదిద్ది
అపూర్వ సహోదరులతో
ప్రేక్షకులను రంజింపచేసి
ఆదిత్య 369 ద్వారా టైం మెషీన్ ద్వారా సమయాన్ని మార్చి చూపించి
భైరవ ద్వీపం ద్వారా తిరిగి అద్భుత జానపదాలను తెలియపరచి
విభిన్న అంశాలద్వారా
తెలుగు వారి ప్రతిభను
డెబ్బది సంవత్సరాల పాటు సినీ రంగంలో విభిన్న కోణాలతో
వసుదైకానికే చాటిన దార్శనికుడు
సింగీతం శ్రీనివాసరావు గారు
సినిమా ఉన్నంత వరకు మీరు సదా స్మరణీయులే
అందుకోండి మీ కివే నా అక్షర నివాళి....!!
.............................
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి