సుప్రభాత కవిత : - బృంద


ఎన్ని జన్మలు ఎత్తినా 
ఏ జన్మకు ఎవరు తల్లి అయినా 
జగమంతటికి  ఎప్పటికీ మాతవైన 
పూజ్యురాలైన ఓ తల్లీ....

నీ అనుగ్రహం కోరి తపనతో 
నిరంతర సాధన చేసి 
రగిలిన మదిలో రేగిన 
శక్తి అనే దేవతవు నువ్వు 🙏

వేల సూర్యులకు వెలుగునిచ్చే 
వేలుపు సగుణ రూపం తో 
సాక్షాత్కారించి సృష్టిని కాచే 
సర్వమంగళవు నువ్వు 🙏

జ్యోతికి వెలుగులా 
మాటకు భావంలా 
తనువుకు మనసులా 
శివ శక్తైక్య రూపం నువ్వు 🙏

మనసుకు చైతన్యం ఇచ్చి 
మమ్మల్ని నడిపించి 
మంచి చెడ్డలు తెలుసుకొమ్మనే 
పంచతన్మాత్రసాయకవు నువ్వు🙏

ఆకలి దప్పులు బాపి 
ఆపదలు రాకుండా చూసి 
అఖిల జగానికి  శాంతిని 
ఇచ్చే అపరాజితవై....

కారణాలు ఏమైనా 
కరుణతో క్షమించి..
సమస్త లోకానికి క్షేమం 
అనుగ్రహించి కాపాడవమ్మా 🙏

శ్రీ చక్ర సంచారిణి పాదాలకు 
శిరసు తాకించి నమస్సులతో 
🙏🙏🙏🙏🙏

🌸🌸సుప్రభాతం 🌸🌸

కామెంట్‌లు