చిన్నా చిన్నా (న ఒత్తు): - వరలక్ష్మి యనమండ్ర


చిన్నా చిన్నా విన్నావా
చిన్నికృష్ణుని కథలన్నీ
అన్నతో ఆడమంటేను
అన్నన్నా అసలు వినడు//చి//

వెన్న, జున్నుల దొంగోడే
కన్నయ్య వేణువు నూదాడే
పొన్నల మాటున ఉన్నాడు
కన్నులకి కనిపించడే //చి//

వెన్నెల్లో ఆటలు ఆడాడే
కమ్మని పాటలు పాడాడే
నందుని ఇంట ఉన్నాడే
అల్లరి చేష్టల చిన్నోడే //చి//

కన్నయ్యను అమ్మ పిలిచింది
తలను నున్నగ దువ్వింది
చక్కగ సిగను చుట్టింది
నెమలి కన్నులు పెట్టింది //చి//

కామెంట్‌లు