తాతయ్య - వరసిద్ధి వినాయకుడు.: -ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ - (పుష్యమి)-సెయింట్ లూయిస్ - అమెరికా.
  

తాతయ్య  మనందరం  వినాయక చవితి పూజ అనంతరం మరునాడు వచ్చే పంచమి నాడు  టెన్నిసీలో నేష విల్లే పట్టణంలోని వినాయకుని ఆలయం దగ్గరకు నా కారులో అమ్మమ్మను మిమ్మల్ని తీసుకెళ్తాను అని  ప్రదీప్ అంటే తప్పకుండా వెళదాం అని సంతోషంగా అన్నాను .
    ఒరే ప్రదీప్ ఆరోజు ఋషి పంచమి నూట ఇరవై ఏళ్ళ క్రితం మీ ముత్తాత గారు పుట్టిన రోజు అదేరా మా నాన్నగారి జయంతి నాకు చాలా ఆనందంగా ఉందని అని అన్నాను 
   తెల్లవారు జామున సెయింట్ లూయిస్ పట్టణం నుంచి బయలుదేరి ఘంటసాల  విఘ్నేశ్వర  స్తోత్రంతో  ప్రారంభించి చక్కటి భక్తి పాటలను కారులో వింటు    ప్రకృతి అందాలను చూస్తు  కొద్దిగా ఎత్తైన ప్రదేశంలో ఉన్న నేష విల్లే గణేష్  దేవాలయం కి వెళ్ళాము
.
   దేవాలయం అంతా చక్కటి ధవళ వర్ణపు కాంతితో గోపురం ధ్వజస్తంభం   బంగారు ఛాయతో మెరిసిపోతు ఎంతో ప్రశాంతతను కలిగి ఉంది 
అక్కడ ఏభై సంవత్సరాల  వయస్సు కలిగిన బట్టతల కలిగిన   ఆయన  నుదుట  విభూతి బొట్టుతో మా దగ్గరకు వచ్చి  మాస్టారు ఎలా ఉన్నారు 
నేను ముప్పై ఐదేళ్ళ క్రితం మీ దగ్గర చదివిన ప్రకాశం అని ఇక్కడ ఇరవై ఏళ్ళయి  కార్డియాలజిస్ట్ గా ఉన్నానని  ఇక్కడ దేవాలయపు నిర్వాహక సభ్యులలో ఒకనిగా ఉన్నానని చెయ్యి పట్టుకుని  మా వ్డపతులిద్దరిని ఇతర వాలింటర్లతో తీసుకెళ్లి కాళ్ళు కడుక్కున్న తరువాత తీసు కెళ్ళాడు 
ఈ గణేష్ దేవాలయం అమెరికాలోని ప్రసిద్ధ గణేష్ దేవాలయం అని నల్లరాతితో చేసిన  దేవతామూర్తి యని 1985  ఏప్రియల్ 14 న ప్రారంభించబడింది అని చెప్పారు ప్రతిరోజు అభిషేక అర్చనలు జరుగుతాయని బుధవారం, పర్వదినాలలో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయని ఇప్పుడు  వినాయక నవరాత్రులను 
ఇతర ప్రాంతాలనుంచి  కూడా భక్తులు వచ్చి భజనలు కీర్తనలు  చేస్తున్నారు ఇక్కడ అందరు తక్కువ ఎక్కువ అనే భేదం లేకుండా ఆలయంలో సేవ చేస్తారని  చెప్పి ఈ ఆలయపు మొదటి ప్రధాన పూజారి (ప్రీస్ట్) శ్రీ ముత్తు కృష్ణ గురుక్కల్  రూప కల్పన తో అభివృద్ధి చెందినదని చెప్పి   ఇప్పుడు దేవాలయంలో అన్ని దేవతామూర్తులను వేంకటేశ్వరస్వామి, అయ్యప్ప, లక్ష్మీదేవి అన్నింటిని ప్రతిష్టించి  అంగ రంగ వైభవంగా ఉత్సవాలను నిర్వహిస్తున్నారని   
ఈ వినాయకుడు కోరిన కోర్కెలు తీర్చే వరసిద్ధి వినాయకుడు అని 
ఇంతటి పవిత్రమైన రోజు దైవం కన్నా మిన్న అయిన మిమ్మల్ని కలవటం అదృష్టమని చెప్పాడు డాక్టర్ ప్రదీప్.
తాతయ్య బయలు దేరుదామంటే  ఉండు బాబు అని  నివేదన చేసిన దద్దోజనం చక్రపొంగలి తీసుకు వచ్చి  ఇచ్చాడు. దేవాలయం బయట  మీరు నా పాలిట  వినాయకులే అని నమస్కరించిన శిష్యుని చూసి పుత్రోత్సాహం తండ్రికి  పద్యం చెప్పి 'శతమానం భవతి 'అని ఆశీర్వదించాను 
తిరుగు ప్రయాణంలో ఏభై సంవత్సరాలయి నాతో కాపురం చేసిన ధర్మపత్ని నిజమే గురువులకు సంపద  శిష్యులే  అన్నది అక్షర సత్యం మే అండి అంటే ఏమనుకున్నావు అని వణికే చేతులతో భుజంపై తట్టాను. వెంటనే మనుమడు  తాతయ్య    అన్నింటి కన్నా ఉపాధ్యాయ వృత్తి వసుదైకాన ఆదర్శం. మీరు అదృష్టవంతులు అన్నాడు. వెంటనే తెల్లని మీసాలను మెలివేసి దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదించాను..!! 
వక్రతుండ మహాకాయ 
 కోటిసూర్య సమప్రభ 
నిర్విఘ్నం కురుమే దేవ 
సర్వకార్యేషు సర్వదా..!!

.................................
కామెంట్‌లు