చినుకు రాలితేనే నదులు పారేది
మెరుపులు మెరిస్తేనే ఉరుములు ఉరిమేది
మట్టి చిట్లితేనె మొక్క మొలిచేది
అద్దం పగిలితేనే ఆయుధంగా మారేదీ.
నిశ్శబ్దం పేలితేనే యుద్ధం జరిగేదీ.
ఆశ చస్తేనే మరణం వచ్చేది
గుండె పగిలితేనే కన్నీటి కుండా నిండేది.
పూత రాలితేనే కాయకాలం చేసేది
చిరునవ్వు చెదిరితేనే మాట బయటికి వచ్చేది.
ఆట ఆగితేనే నోట మాట రానిది
చెమట చిందితేనే పంట పండేది.
========================================
సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని యుపిఎస్ ఖానాపూర్ నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి