రెండవ చర్మం.!!: - డా ప్రతాప్ కౌటిళ్యా.


చర్మం ఎంత ముఖ్యమో 
చర్మం రంగు అంతే ముఖ్యం 

మనుషుల్ని విడదీసేది చర్మం 
మనుషుల్ని కలిపేది చర్మం 

మనుషుల్లో ముఖ్యమైనది 
ముఖము 
ముఖమే మన గుర్తింపు 
అంతకన్నా ముఖ్యమైనది 
చర్మం. చర్మం రంగు ముఖ్యం. 

ముఖమే అందం 
చర్మం రంగే అందం 

రెండో చర్మం కూడా ముఖ్యం 
రెండో చర్మం రంగు కూడా ముఖ్యం 

ముఖం కన్నా 
చర్మం రంగు కన్నా 
మనం వేసుకునే దుస్తువులే 
ముఖ్యం 
దుస్తుల రంగులే 
ముఖ్యం. 

ముఖమే అందం 
చర్మమే అందం 
చర్మం రంగులే అందం 
దుస్తులే అందం 
దుస్తువుల రంగులే అందం.!!
=========================
-డా ప్రతాప్ కౌటిళ్యా.
కామెంట్‌లు