శాంతి అహింసలే సాధనాలుగా
పరదేశీయుల పాలన నుంచి
భరతమాత దాస్య శృంఖలాలను
విడిపించి
స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను మనకు ప్రసాదించిన
మహాత్మాగాంధీ
గెలవక పోవటం కాదు ఓటమి
తిరిగి ప్రయత్నం చేయక పోవడమే అసలయిన ఓటమి అని
దరిద్ర నారాయణులు తన పాలిట దేవుళ్ళని
అంటరాని తనం అంటురోగం వంటిదని
హరిజనోద్దరణ, గ్రామ స్వరాజ్యం దేశాభివృద్ధికి తోడ్పడునని
అర్ధరాత్రి స్త్రీ ఒంటరిగా నడిరోడ్డు పై
నడచినపుడే దేశానికి అసలయిన స్వాతంత్ర్యమని
దేశం కోసం బుల్లెట్లదాడిలో
ప్రాణత్యాగం చేసిన మహాత్మా గాంధీ చిర స్మరణీయులు..!
నిబద్ధత , నిస్వార్థ సేవ కోసం
పేదరికంలో పుట్టిన కాదేది పదవికి అనర్హమని
వ్యాస కాశీలో పుట్టి పాఠశాలకు
గంగానదిలో ఈత కొట్టి
ఆవలి ఒడ్డున చేరి
ఉన్నత పాండిత్య పట్టా
'శాస్త్రి 'ని పొంది
గాంధీ మహాత్ముని ఆశయాల ప్రేరణచే
స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొని
స్వాతంత్ర్యానంతరం రైల్వే శాఖ మంత్రి పదవి చేపట్టినా
రైలు ప్రమాదం జరిగిన తక్షణమే
పదవికి రాజీనామా చేసిన లాల్ బహదూర్ శాస్త్రిగారు
నిష్కళంక నిజాయితీ గల 'ప్రజానాయకుడు
ప్రధాని మంత్రి పదవిలో.
'జై జవాన్ జై కిసాన్' అనే నినాదంతో
దేశానికి వెన్నుముకలు కర్షకులు, జవానులని
ప్రజలకు ప్రేరణనిచ్చి
పాకిస్థాన్ యుద్ధంలో దేశభక్తిని ప్రజలలో పెంపొందించి
పొట్టి వారైన గట్టివారని కీర్తింపబడిన శాస్త్రిజీ
సదా స్మరణీయులే .
గాంధీజీ మరియు శాస్త్రీజీ భరతావనికే కాదు వసుదైకానికే ఆదర్శం..!!
====================================
......................
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి