పాలఖండ్యాం ఎంపియుపి పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయులు, జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ రాష్ట్రపతి పురస్కార గ్రహీత కుదమ తిరుమలరావు జాతీయ స్థాయి కవితల పోటీల్లో పాల్గొని ప్రశంసాపత్రం సాధించారు. శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో నారీ శక్తి అను అంశంపై నిర్వహించిన కవితల పోటీల్లో తిరుమలరావు పాల్గొని ప్రశంసాపత్రం పొందారు. వేదన నుండి వేడుకకు అను కవిత పంపి, అంతర్జాలం ద్వారా ప్రశంసాపత్రం పొందారు. ఐ.ఎ.ఎస్.గుర్తింపు పొంది, ఇప్పటికి 170పైబడి రాష్ట్ర సదస్సులు, జాతీయ కవి సమ్మేళనాలు, ప్రపంచ మహాసభలను ఎంతో వైభవంగా నిర్వహించి, 36 ప్రపంచ రికార్డులను సాధించి, గత పదేళ్లుగా వివిధ ప్రత్యేక పర్వదినాల్లో ఆయా సందర్భాలననుసరించి కవితలు కథలు వ్యాసాలు వంటి సాహిత్య ప్రక్రియల పోటీలు నిర్వహిస్తూ వేలాది మందిని ప్రోత్సహిస్తున్న శ్రీశ్రీ కళావేదిక నుండి తిరుమలరావుకు ఈ ప్రశంసాపత్రం ఘనత లభించింది. తిరుమలరావు మహిలో మహిమ మహిళ అంటూ ఎత్తుగడతో తన కవిత ఆరంభించారు. జర్మన్ సామ్యవాద నాయకి క్లారా జెట్ కిన్ ఆధ్వర్యంలో, డెన్మార్క్ కోపెన్ హాగన్ వేదికగా మహిళల సమస్యల పరిష్కారానికి చేసిన కృషిని ఉదహరించారు. వందేళ్ల క్రితం రష్యా సామ్యవాద విప్లవం వీ వాంట్ బ్రెడ్, వీ వాంట్ పీస్ నిరసన జ్వాలలో చక్రవర్తి నికోలస్ జార్ టు గద్దె దిగక తప్పని సందర్భాన్ని నారీ శక్తి అంశం కవితలో ప్రస్తావించారు. నేటి గివ్ టు గెయిన్ పథకం వివక్ష హింసలపై గురిపెట్టే గన్ అంటూ మహిళల ప్రస్థానాన్ని తన కవిత ముక్తాయింపుగా వివరించారు. ఈ మేరకు హైదరాబాద్ కేంద్రంగా అంతర్జాలం ద్వారా నిర్వహించిన ఈ పోటీలకు శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ ఛైర్మన్ కత్తిమండ ప్రతాప్ కుమార్ నేతృత్వం వహించగా, జాతీయ అధ్యక్షురాలు జి.ఈశ్వరీ భూషణం ఆధ్వర్యంలో, జాతీయ ప్రణాళికా అధికారి డా.టి.పార్ధసారథి, జాతీయ కార్య నిర్వహణ అధికారి నూక సంపత్ కుమార్, జాతీయ సోషల్ మీడియా కన్వీనర్ నల్లా భాగ్యలక్ష్మిల పర్యవేక్షణలో జరిగిన ఈ కవితల పోటీలకు, సమన్వయకర్తలుగా మళేకార్ నాగజ్యోతి, చండ్ర వెంకటేశ్వరరావు, నరసింహశర్మ, సువర్ణ జోషి, సాహు సంథ్య, సబ్బెళ్ళ మహాలక్ష్మి రెడ్డి, పి.సాయిసంతోషి, గుడిసి లావణ్యలు వ్యవహరించి, వేదన నుండి వేడుకకు అను కవితను అభినందిస్తూ తిరుమలరావుకు ప్రశంసాపత్రాన్ని పంపారు. కుదమ తిరుమలరావు గానం, చిత్రలేఖనం, నటన, రచన, సేవారంగాలలో ప్రతిభా పాటవాలను ప్రదర్శిస్తూ, నేడు జాతీయ స్థాయి కవితల్లో ప్రశంసాపత్రం పొందుట పట్ల రాజాం రచయితల వేదిక కన్వీనర్ గార రంగనాథం తదితరులు హర్షం వ్యక్తం చేసారు.
శ్రీశ్రీ కళావేదిక పోటీల్లో తిరుమలరావుకు ప్రశంసాపత్రం
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి