కాంచన జలం చిమ్ముతూ
కదిలివచ్చేనదిగో ...
కనక కలశం..
కదిలే మొయిళ్లను
హేమమయం చేసి
భువనము మేలుకొలుప
తరలి వచ్చే తరణి!
దవ్వున వెడలిన కిరణం
రివ్వున వచ్చి వాలేనదిగో
పువ్వులకు నవ్వులు నేర్పగా
తోటకు బంధువై !
తుహిన గిరుల వాలున
కరిగి జారి సాగిన
హిమ శకలముల చల్లదనం
మోసుకొచ్చిన గాలి!
సుమగంధపు లాహిరిలో
మైమరచి తోటలో
ప్రతి రెమ్మను ఊపి ఊపి
పలుకరించె ప్రేమగా...
కలల కమ్మని కోనలో
కురిసే వెలుగుల వాన!
కనుల ముందు నిలిపే
కమల బాంధవుని రాక !
🌸🌸సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి