ధర్మేచ అర్ధేచ కామేచ నాతి చరితవ్యమని
సన్నాయి మేళాల వేదపండితుల
ఆశీర్వచనాలు
పెద్దల ఇరుకుటుంబాలు సమక్షంలో
వరుడు వధువు మెడలో మూడు ముళ్ళబంధంతో ఒక్కటై
సప్తపదితొక్కిన వధువు ఏడడుగుల బంధంతో
కొంగుముడి వీడక అగ్ని సాక్షిగా జరిగే
సనాతన కాలం నుంచి వచ్చే వివాహా బంధం
వసుదైకాన అతి పవిత్ర బంధం .
కన్నవారిని కట్టుకున్నవారిని వదలి
గోత్రం మార్చుకు
తనతో వచ్చి కష్ట సుఖాలలో కలిమిలేములలో
పిల్లల బాధ్యతలో తోడునీడగా
ఉండే అర్ధాంగితో జీవితమంతా
ఒకరి కొకరు ఒకరు
మనసున మనసుగా జీవించి
అర్థ నారీశ్వరతత్వానికి ప్రతీకగా నిలిచే
ఏడడుగుల బంధం జగతిన అతి పవిత్రబంధం....!!
.........................
.. ................
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి