బంధువులు మిత్రులు కుటుంబ సభ్యులు
అన్నదమ్ములు అమ్మానాన్నలు అన్నా చెల్లెలు
వీళ్ళ మధ్య గొడవలు ఉంటాయి గోడలు ఉంటాయి.
పడగొట్టలేని గోడలు కట్టబడతాయి.
విజయం లేకపోవడం
ధనం లేకపోవడం వల్ల
వాళ్లకు సంతోషం ఉండదు
గౌరవం ఉండదు
వాళ్ల మధ్య గోడలు కట్టబడతాయి.
కృత్రిమఆత్మీయతలు
యాంత్రిక ప్రేమల మధ్య
గోడలు కట్టబడతాయి.
వాళ్లు ఎప్పటికీ కలుసుకోరు
వాళ్లు ఎప్పటికీ విడిపోరు
వారి మధ్య పోరు జరుగుతూనే ఉంటుంది
వాళ్ల మధ్య గోడలు పగలగొట్టాలంటే
ఒక విజయం కావాలి
సంపద కావాలి.
అప్పుడే ఆ బంధాలు పండగ చేసుకుంటాయి.
అప్పుడే వాళ్ళ మధ్య
ప్రేమ పుడుతుంది సంతోషం పుడుతుంది గౌరవం పుడుతుంది.
గోడలు పగలగొట్టబడతాయి.!!?
--------------------------------------------
డా ప్రతాప్ కౌటిళ్యా.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి