"ప్రతి మాట....ఓ ముత్యము": - కలమట శ్రీనివాస్ రావు -విశాఖపట్నం
బాల్యం లో ఉ.... ఉ.... ఉ..... అనే కూని రాగాల మాట మొదటి మాట
చిరునవ్వుతో చక్కని నవ్వు ఒక మాట
అమ్మ తాత మామ అని ఒక మాట.
చిట్టి చిట్టి చిలక పలుకులు మాట ఆనందాన్ని ఇచ్చే మాట
చక్కని కథలతో ప్రేమని పంచే అమ్మ మాట
జీవిత లక్ష్యం,చేరుకునే ధైర్యం కోసం నాన్న చెప్పే మాట


జ్ఞానానిచ్చే గురువుల మాట 
యోగ,స్కేమాలను పంచుకునే స్నేహితుని మాట
జీవితంలో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించే పెద్దల మాట 

మాటే మంత్రం 
మాటే ముత్యం 
మాటే బంధము 
మాటే స్నేహము
మాటే గౌరవం 
మాటే భాణము 
మాటే గాయం 
మాటే మకరందం.

మాట వినాలని ఉంటే మాట మాట్లాడితే ముత్యం రాలుతాయి అంట .
అదే మాట వి వినసొంపుగా ఉంటే చెవిలో అమృతం పోశావు అంట 
మాట కఠినంగా ఉంటే కత్తికన్నా పదునైనా అంట 
మాట సుతిమెత్తనిదైతే  బంధాల ప్రగతికి అంట మాటతో శత్రువు అవుతారు మాటతో మిత్రుడు అవుతాడు అంట ఒక్క మాటతో ప్రాణ స్నేహితుడు దూరమవుతాడు.
మాట ఆలోచించి మాట్లాడితే అప్తులవుతారు అంట.
అందుకే మాట కాదు మాట్లాడే విధానం ముఖ్యం.
కామెంట్‌లు