మన గురించి కొన్ని ఆసక్తికరమైన సైకాలజీ నిజాలు:: - - యామిజాల జగదీశ్
 

ఇతరులతో మాట్లాడేటప్పుడు చేతులు కట్టుకోకండి. అలా చేస్తే మీరు బలహీనంగా ఉన్నారనిపిస్తుంది.
మాట్లాడేటప్పుడు ఎదుటివారి కళ్లలోకి చూస్తూ మాట్లాడండి. ఇది మిమ్మల్ని నిజాయితీ గల వ్యక్తిగా చూపుతుంది.
చాలా దూరంలో ఉన్నవారితో గొంతు పెంచి అరిచి మాట్లాడకండి. మీరు చెప్పేది అవతలివారు వినాలంటే, వారి దగ్గరగా వెళ్లి ముఖం చూస్తూ మాట్లాడండి.
నిటారుగా కూర్చొని లేదా నిలబడి మాట్లాడండి. వంగి కూర్చుంటే మిమ్మల్ని బద్ధకస్తుడనుకునే అవకాశం ఉంది.
మాట్లాడేటప్పుడు జుట్టు సరిచేసుకోవడం, పదే పదే బట్టలు అలంకరించుకోవడం లాంటివి చేయకండి. ఇవి మీలో ఆత్మవిశ్వాసం లేదని చూపిస్తాయి.
గోళ్లు కొరకడం, పెన్ లేదా పెన్సిల్ చివరలు నమలడం మానండి. అలా చేస్తే మీరు భయపడకుండా ఎదుటివారికి అర్థమవుతుంది.
నవ్వుతూ మాట్లాడితే మీ మాటలు వినడానికి ఇష్టపడని వారు కూడా శ్రద్ధగా వింటారు.
పిల్లలతో మాట్లాడేటప్పుడు వారి పక్కన కూర్చుని ప్రేమగా మాట్లాడండి. మీరు చెప్పేది స్పష్టంగా అర్థమవ్వడానికి సైలను చూడండి.
ఆత్మన్యూనతా భావాన్ని (తక్కువ అంచనా వేసుకోవడాన్ని) వదిలించుకోవడానికి కొన్ని మార్గాలు:
మీరు అందంగా ఉన్నందుకు ముందుగా మీరు నమ్మండి. రంగుకు, అందానికి సంబంధం లేదని గ్రహించండి.
ఎవరో వచ్చి మెచ్చుకుంటేనే నేను అందంగా ఉన్నాననుకోవడం మానేయండి. మిమ్మల్ని మీరు ముందుగా అభిమానించుకోండి.
ఏదైనా భాష స్పష్టంగా మాట్లాడలేకపోతున్నానని బాధపడకండి. మిమ్మల్ని ఎగతాళి చేసేవారికి ధైర్యంగా సమాధానం చెప్పండి — ఇక్కడ చాలామందికి సొంత మాతృభాషే సరిగా మాట్లాడటం రాదని గుర్తుచేయండి.
నీవల్ల ఏమీ కాదు, నీకేం తెలియదు అని ఎవరైనా అంటే... దాన్ని సవాలుగా తీసుకుని, త్వరలోనే ఆ పని నేర్చుకుని చూపించడానికి పట్టుదలతో ప్రయత్నించండి.
నా జీవితం అంతా బాధలతోనే నిండిపోయిందని అనుకోకండి. అందరికీ అన్నీ లభించే పరిపూర్ణమైన జీవితం ఈ ప్రపంచంలో ఎవరికీ ఉండదనేది పచ్చి నిజం.
మీకు ఏమీ తెలియదని, ఎదురుగా ఉన్న వ్యక్తికి అన్నీ తెలుసునని ఎప్పుడూ అనుకోవద్దు. ఆ ఆలోచన ఉంటే మీరు చెప్పాలనుకున్నది తడబడకుండా చెప్పలేరు.
ప్రశ్నించడానికైనా, మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికైనా గొప్ప భాషాజ్ఞానం అవసరం లేదు. లోకాన్ని ఆలోచింపజేసిన ఎన్నో ప్రశ్నలు వేసినవారు భాషా పండితులు కారు, మీకు తెలిసిన కొన్ని సాధారణ మాటలతోనే పరిశీలన స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పినవారు.
ఏడవాలనిపిస్తే ఒంటరిగా ఏడవండి. మీరు పిలిచినా మీతో కలిసి ఏడవడానికి ఇక్కడ ఎవరూ రారనే నిజాన్ని ఒప్పుకోండి. కన్నీళ్లతో పాటే మీ బాధను తుడిచేసి, ధైర్యంగా ముందుకు సాగండి. మీ ప్రేమను ఎవరైనా తిరస్కరిస్తే, ఆ నష్టం మీకు కాదు... మిమ్మల్ని వదులుకున్న వారికే అని గుర్తుంచుకోండి.
కామెంట్‌లు