సుఖదుఃఖాల మేళవింపు, కష్టసుఖాల కావడి.
మనసును బాధించిన ఘటనలు ఎన్నో,
ఆనందాన్ని పంచిన ఘడియలు మరెన్నో.
విజయాన్ని చేకూర్చిన మధుర క్షణాలు,
పరాజయపు రుచి చూపిన చేదు వేళలు.
అన్నీ కలిసి జ్ఞాపకాలుగా మిగిలి,
మన జీవిత పుటల్లో ముద్రలై నిలిచాయి.
ఏది ఉచితమో, ఏది అనుచితమో,
ఏవి కోల్పోయామో, ఏవి పొందామో,
ఏ సంఘటన నుంచి ఏ పాఠం నేర్చుకున్నామో,
అవే నేటి అనుభవాలుగా మారాయి.
జరిగిన తప్పులు సరిచేసుకుంటూ,
కొత్త తప్పులు జరగకుండా ప్రయత్నిస్తూ,
బ్రతుకు బండిని ముందుకు నడిపేందుకు,
ఆ అనుభవాలే మార్గాన్ని చూపిస్తాయి.
నిన్నటి జ్ఞాపకం నేటికి గుణపాఠమై,
నేటి అనుభవం రేపటికి దిక్సూచియై,
జీవిత పయనంలో మనకు తోడై నిలుస్తాయి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి