మానవత్వానికే తీరని కళంకం
ఒరులను ప్రేమించి సాయపడుటయే
మనిషి పుట్టుకకు అర్థం... పరమార్థం...
దెబ్బ వేసి శరీరాన్ని గాయపరచుట
మాటలతో వేటువేసి మనసును బాధించుట
అవమానాలు బెదిరింపులు చులకన భావాలతో
మనిషి ఆత్మాభిమానాన్ని చీల్చుట హింసయే
డబ్బు కోసం దగాలు దోపిడీలు చేయుట
ఆన్‌లైన్ మోసాలతో వేధింపులకు తెగబడుట
చిన్నారి బాలలను బెదిరించి భయపెట్టుట
యుద్ధం పేరుతో దేశాలను కబళించుట హింసయే
పచ్చని ప్రకృతిని బీడుభూమిగా మార్చుట
నోరులేని మూగజీవులను వేధించుట
మతం పేరుతో మనుషులను విభజించుట
కులం పేరుతో కుమ్ములాటలకు దిగుట హింసయే
స్వీయ హింసకు పూనుకొనుట
ఇతరుల భావోద్వేగాలతో ఆడుకొనుట హింసయే
ఓ నరుడా! హింస దారిలో పయనించవద్దు
దయ జాలి కరుణలను ఎన్నడూ మరువవద్దు
నీ చేతలతో ఓ జీవికి కష్టం కలుగనీయవద్దు
నీ మాటలతో ఓ మనసుకు గాయం చేయవద్దు
మనిషి జీవితం భూమిపై
ప్రశాంతంగా కొనసాగాలంటే
హింసను అంతం చేయాలి
ప్రేమను సొంతం చేసుకోవాలి
ద్వేషాన్ని విడిచి ప్రేమను పంచుదాం
కోపాన్ని విడిచి కరుణను చూపుదాం
హింస వద్దు...ప్రేమ, కరుణ ముద్దు...
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి