తాతయ్య ఎలాగ శరన్నవరాత్రులు నేను అమ్మమ్మ ఇంట్లో చేస్తాం ఎక్కడికి రాలేమంటారు . దశమి నాడు సెయింట్ లూయిస్ లో ఉన్న మా గణపతి దేవాలయం ప్రాంగణంలో పెట్టిన దుర్గాదేవి ని చూడటానికి సాయంత్రం వెళదాం అని సాఫ్ట్వేర్ మనుమడు ప్రదీప్ అన్నాడు. వెంటనే అమ్మమ్మ కూడ దశమి నాడు నీవు సెలవు పెట్టావు మన దేవి నవరాత్రులు ఇంట్లో బాగా జరిగాయి
అమెరికా లో కూడ విసుక్కోకుండా చిన్నవాడైన ప్రదీప్ వాడి భార్య అన్నీ అమర్చారు
చక్కగా దేవి సప్తశతి దేవీ భాగవతం లలితా పారాయణం చేసుకున్నాము పొద్దున్నే పూజ అయిన వెంటనే చక్కగా మన రాజమండ్రి స్వస్థలం పురోహితుడు దేవాలయంలో ఉన్నతను వచ్చి వేద ఆశీర్వచనం చేసారు. అతనికి ఆయన శ్రీమతికి కూడా కొత్తవస్త్రాలు తాంబూలం ఇచ్చి మనుమడిని భార్యను దీవించమన్నాను. ఈ కాలపు పిల్లలయిన ఇద్దరు పుస్తక పూజ చేసి విజయదశమి కథ చదివి అష్టోత్తర శతనామాలతో పూజించి నీరాజన మంత్రపుష్పాలతో నివేదన చేసారు ఇంట్లో మన ఊళ్ళో కన్నా దేవీ పూజ బాగా జరిగింది . తప్పక సాయంత్రం మనుమడి తో దుర్గాదేవిని చూడటానికి వెళదాం అని నా అర్ధాంగి అంది. నీ మాటనెప్పుడు కాదన్నాను అన్నాను.
సాయంత్రం రెండు గంటల దూరంలో ఉన్న గుడికి మనుమడు ప్రదీప్ తో బయలు దేరి గుడికి వెళ్ళి లోపల ఉన్న వినాయక, సుబ్రహ్మణ్య రాజరాజేశ్వరీ మాత శివ వెంకటేశ్వర నవగ్రహాలను చూపించి ఇవి నల్ల రాతి తో శ్రీ చక్ర ప్రతిష్ఠతతో ఇండియా నుంచి వచ్చిన వేద పండితుల ద్వారా ప్రతిష్టించ బడిన దేవతామూర్తులు. నవగ్రహాలు కూడా చూడండి అని చూపిస్తే ఒరే ఎంత బాగున్నాయి తేజస్సు ఉట్టి పడుతున్నాయని మా ఆవిడ అన్నది .
అమ్మమ్మ గుడి బయట దేవి విగ్రహం పెట్టారు వెళదామని చూపిస్తే ఆ విగ్రహం చూసి ఎంత బాగుందో అని
కాత్యాయని
మహామాయే
ఖడ్గబాణ ధనుర్ధరీ..!
ఖడ్గధారిణి చండి శ్రీ దుర్గాదేవి నమోస్తుతే.
.!!
అని పూర్తిగా దుర్గాష్టకం చెప్పి
ఒరే ఓ పది డాలర్లు ఇవ్వరా అని హుండీ లో వేసింది అక్కడ భారతీయులతో బాటు విదేశీయులు చీరకట్టుకు రావడం నుదుట కుంకుమ ధరించి తీర్థ ప్రసాదాలు తీసుకుని కళ్ళకు అద్దుకుని తీసుకోవడం ఆశర్యం వేసి నాతో పక్క ఇంట్లో పనిమనిషి మతం మారాను తీసుకోననడం ఇక్కడ వీళ్ళు తీసుకోవడం బాగుందండి
అందుకే వసుదైక కుటుంబం అన్న మీ మాట నిజమే అన్న ధర్మపత్నితో మరేమిటి తాతయ్య చెప్పినది వేదం .చీకటి పడుతున్నది
మీ ఇద్దరికి ఫోటో మా ఊరి దుర్గమ్మతో తీస్తాను అని చూపించి ఆది దంపతుల వలె బాగున్నారని అని నమస్కరిస్తే ఇద్దరం ఒక్కసారి మళ్ళీ సంవత్సరానికి అమ్మ అనుగ్రహం తో చక్కటి సంతానం కలుగుతుంది అని అంటే పక్కనే ఉన్న తెలుగు ఆయన తథాస్తు దేవతలుంటారు . నన్ను కూడా దీవించండి అన్నాడు. తప్పకుండా నీవు మా మనుమడు లాంటివాడివే
'లోకా సమస్తా సుఖినోభవంతు' అన్నది మన సనాతనం అన్నాను.
దారిలో మనుమడుతో రెండు పూటల స్నాన పాదాదులు మొదట్నుంచి వచ్చే సంప్రదాయం పైగా మీరు ఉద్యోగస్తులు అందు వల్ల ఏదొచ్చిన మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళం అవుతాం అందుకే రాలేదు చివరి రోజున వచ్చామంటే మీ సంగతి తెలుసు కదా అమ్మమ్మ అందుకే ఈ రోజు శెలవు తీసుకుని మరీ వచ్చాను అన్న మనుమడిని ఇంటికి వెళ్ళిన తర్వాత మునిమడు పుట్టినప్పుడు తప్పక నేను తాతయ్య వస్తాం
భగవంతుని నమ్మిన వారు చెడిపోరు అని ఆప్యాయంగా మనుమడి చేతిని తీసుకుంది మా ఆవిడ..!!
సర్వ మంగళ మాంగళ్యే
శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్రంబకే దేవి నారాయణి నమోస్తుతే..!!
.................................
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి