1.ఆ.వె. విద్య తోడ జగము విజ్ఞానవంతులై
మంచి ఎంతొ నెరిగి మాన్యులయ్యి
చదువుకొనుటవలన చక్కగా నెదిగేరు
స్వర్ణ జ్యోతి పలుకు సౌఖ్యమిచ్చు
2.ఆ.వె. విద్య నేర్చినపుడె వికసించు జగమంత
విద్య లేకపోతె విలువలేదు
చదువులోనె మనము సకలంబు పొందేము
స్వర్ణ జ్యోతి పలుకు సౌఖ్యమిచ్చు
3.ఆ.వె. చదువుకుంటె జగతి చక్కగా వెలుగును
విద్యనేర్వు నీవు వినయముగను
విద్య వలన మనకు విలువెంతొ గల్గును
స్వర్ణ జ్యోతి పలుకు సౌఖ్యమిచ్చు
4.ఆ.వె. కార్పొరేట్ విద్య ఘనముగా కొలిచేరు
ధనము పెట్టి జనులు తరలుచుండె
ఉచిత పాఠశాల నొప్పదు జనులకు
స్వర్ణ జ్యోతి పలుకు సౌఖ్యమిచ్చు
5.ఆ.వె. విద్య పేరు జెప్పి విపరీత పైసలు
ఫీజులెన్నొ పెంచి దోచుచుండె
విద్య విలువ మరచి వికటించు చుండిరి
స్వర్ణ జ్యోతి పలుకు సౌఖ్యమిచ్చు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి