అమ్మ విలువ : - పి.రేష్మిత-10వ,తరగతి-జి.ప.ఉ.పా.రామంచ-మం:చిన్నకోడూరు-జి.సిద్దిపేట
 

ఒక ఊరిలో కార్తీక్ అనే బాలుడు ఉండేవాడు. అతను 10వ తరగతి చదువుతున్నాడు. కార్తీక్ చిన్నప్పుడు చాలా చక్కగా చదివేవాడు, కానీ పదవ తరగతికి వచ్చాక చదవడం తగ్గించాడు. అందరూ తిట్టినా కార్తీక్ సరిగ్గా చదివేవాడు కాదు. ఒకరోజు వారి తెలుగు ఉపాధ్యాయురాలు తరగతిలో అందరితో, రేపు మీరంతా మీ తల్లిదండ్రులు చిన్నప్పుడు ఎంత కష్టపడ్డారో అడిగి తెలుసుకొని, రాసుకొని రావాలి " అని చెప్పారు. దానికి అందరూ సరే అన్నారు.
కార్తీక్ ఇంటికి వెళ్ళగానే వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్లి, "అమ్మా! మీ చిన్నప్పుడు మీకు పాఠశాలలు ఉన్నాయా? మీకు అన్ని వసతులు ఉన్నాయా?"అని అడిగాడు. అప్పుడు వాళ్ళ అమ్మ,"మేము చదువుకునేటప్పుడు మాకు మీలా పాఠశాలలు లేవు, సరిగ్గా పుస్తకాలు లేవు, పక్క ఊరిలో ఉన్న పాఠశాలకు నడుచుకుంటూ వెళ్లి చదువుకునేవాళం. మాకు అప్పట్లో రోడ్లు లేవు, బస్సులు లేవు. అలాగే మీకు ఉన్నట్లుగా మాకు అంతమంది ఉపాధ్యాయులు లేరు, ఒకే టీచర్ ఉండేవారు. మాకు వేసుకోవడానికి సరిగ్గా బట్టలు కూడా ఉండేవి కావు. అందుకే మేము సరిగ్గా చదువుకోలేకపోయాము "అని చెప్పింది 
"ఇప్పుడు మీకు అన్ని వసతులు వచ్చాయి. మాలాగ మీరు కాకూడదు, మీరు బాగా చదువుకోవాలనే ఆశతో మీరు ఏం అడిగినా సరే కష్టపడి సమాకురుస్తున్నాము. నువ్వు బాగా చదువుకొని మంచి స్థాయిలో ఉంటే చూడటమే నా కోరిక. నువ్వు ఉన్నత చదువులు చదివి ఈ అమ్మకు మంచి పేరు తీసుకురావాలి" అని చెప్పింది అమ్మ మాటలు విన్న కార్తీక్, "సరే అమ్మా! నేను బాగా చదువుకొని నీకు, మా పాఠశాలకు, మన ఊరికి మంచి పేరు తెస్తాను"అని మాటిచ్చాడు.
ఆ మరుసటి రోజు నుండి కార్తీక్ ఎంతో శ్రద్దగా చదువువాడు. అతని మార్పును చూసి ఉపాధ్యాయులందరూ ఎంతగానో మెచ్చుకున్నారు. కార్తీక్ పట్టుదలతో చదివి చివరకు పోలీస్ అధికారి అయ్యాడు. పోలీస్ యూనిఫాం వేసుకొని వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళాడు. కొడుకును ఆ రూపంలో చూసిన వాళ్ళ అమ్మ ఎంతో సంతోషించింది, ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. ఆ తర్వాత తను చదువుకున్న పాఠశాలకు వెళ్ళినప్పుడు, తనకు విద్యాబుద్దులు నేర్పిన ఉపాధ్యాయులు కూడా ఎంతో గర్వపడి సంతోషించారు.
నీతి: తల్లిదండ్రుల కష్టాన్ని, త్యాగలను గుర్తించి కష్టపడి చదివితే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు.
కామెంట్‌లు